Asia Cup 2023 Sl vs Ban : ఆసియా కప్ 2023లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై శ్రీలంక 5 వికెట్ల తేడాతో గెలిచింది. బంగ్లా నిర్దేశించిన 165 పరుగుల స్వల్ప టార్గెట్‌ను.. లంక 39 ఓవర్లలో ఛేదించింది. శ్రీలంక బ్యాటర్లలో సదీర సమరవిక్రమ (54), చరిత్ అసలంక (62) అర్ధ శతకాలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో షకీబ్ అల్ హసన్ 2, ఇస్లామ్, తస్కిన్ అహ్మద్, హసన్ తలో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. 164 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో శాంటో (89) ఒక్కడు తప్ప మిగతా వారెవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. లంక బౌలర్లలో మతీషా పతిరణ 4, తీక్షణ 2, ధనంజయ డి సిల్వా, వెల్లలగే, షనక తలో వికెట్ తీశారు.
Srilanka Vs Bangladesh : లక్ష్యం చిన్నదే అయినా లంక ఆట కూడా బంగ్లా ఇన్నింగ్స్‌నే తలపించింది. బంతి బ్యాట్‌పైకి రాకపోవడం వల్ల అనవసర షాట్లకు పోయిన ఆ జట్టు బ్యాటర్లు.. అనూహ్యంగా వికెట్లు పారేసుకున్నారు. దీంతో 9.2 ఓవర్లలో 43/3తో లంక ఇబ్బందుల్లో పడిపోయింది. ఇక ఈ స్థితిలో అసలంక, సమరవిక్రమ జోడీ జట్టుకు అండగా నిలిచింది. క్రీజులో కుదురుకోవడానికి సమయం తీసుకున్న ఈ ద్వయం.. నెమ్మదిగానే జోరు పెంచింది. వీలుచిక్కినప్పుడల్లా బంతిని బౌండరీని దాటించి స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ముఖ్యంగా పుల్, స్వీప్ షాట్లతో పరుగులు రాబట్టిన అసలంక.. మెహదీ హసన్ బౌలింగ్‌లో డీప్‌లో ఓ మెరుపు సిక్స్ కూడా బాదాడు. అయితే లక్ష్యానికి సమీపంగా ఉన్న సమయంలో సమర విక్రమతో పాటు ధనంజయ (2) వికెట్లు పడినప్పటికీ.. కెప్టెన్ శానక (14 నాటౌట్)తో కలిసి అసలంక మరో వికెట్ పడకుండా జట్టును గెలిపించాడు. మరోవైపు బంగ్లా బౌలర్లలో షకిబ్ (2/29) రాణించాడు.
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: నయీం (సి) నిశాంక (బి) ధనంజయ 16; తంజిద్ ఎల్బీ (బి) తీక్షణ 0; నజ్ముల్ శాంటో (బి) తీక్షణ 89; షకిబ్ (సి) కుశాల్ (బి) పతిరన 5; తౌహిద్ ఎల్బీ (భి) శానక 20; ముష్ఫికర్ (సి) కరుణరత్నే (బి) పతిరన 13; మిరాజ్ రనౌట్ 5; మెహదీ హసన్ ఎల్బీ (బి) వెల్లలాగె 6; తస్కిన్ (సి) తీక్షణ (బి) పతిరన 0; షోరిఫుల్ నాటౌట్ 2; ముస్తాఫిజుర్ ఎల్బీ (బి) పతిరన 0; ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (42.4 ఓవర్లలో ఆలౌట్) 164; వికెట్ల పతనం: 1-4, 2-25, 3-36, 4-95, 5-127, 6-141, 7-162, 8-162, 9-164; బౌలింగ్: రజిత 7-0-29-0; తీక్షణ 8-1-19-2; ధనంజయ 10-0-35-1; పతిరన 7.4-0-32-4; వెల్లలాగె 7-0-30-1; శానక 3-0-16-1
శ్రీలంక ఇన్నింగ్స్: నిశాంక (సి) ముష్ఫికర్ (బి) షోరిఫుల్ 14; కరుణరత్నే (బి) తస్కిన్ 1; కుశాల్ మెండిస్ (బి) షకిబ్ 5; సమరవిక్రమ (స్టంప్డ్) ముష్ఫికర్ (బి) మెహదీ హసన్ 54; అసలంక నాటౌట్ 62; ధనంజయ డిసిల్వా (బి) షకిబ్ 2; శానక నాటౌట్ 14; ఎక్స్‌ట్రాలు 13 మొత్తం: (39 ఓవర్లలో 5 వికెట్లకు) 165; వికెట్ల పతనం: 1-13, 2-15, 3-43, 4-121, 5-128; బౌలింగ్: తస్కిన్ అహ్మద్ 7-1-34-1; షోరిఫుల్ ఇస్లాం 4-0-23-1; షకిబ్ 10-2-29-2; ముస్తాఫిజుర్ 3-0-12-0; మిరాజ్ 5-0-26-0; మెహదీ హసన్ 10-0-35-1
Asia Cup 2023 Pak vs Nepal : నేపాల్‌పై పాక్ పంజా.. భారీ తేడాతో బంపర్ విక్టరి