Asia Cup 2023 Pakistan Team : ఆసియా కప్‌లో భాగంగా జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో భారత్ చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. ఎంతో ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్‌లో 228 పరుగుల తేడాతో వెనకడుగేసింది. అయితే ఈ ఓటమితో డీలా పడ్డ పాక్ సేనకు మరో షాక్ తగిలింది. ఆ జట్టులోని కీలక పేసర్లు హారీస్ రవూఫ్, నసీమ్ షాలు ఆసియా కప్ టోర్నీకి దూరం కానున్నారు. మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో వీరిద్దరూ గాయాలపాలు కావడం వల్ల రానున్న మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
"హారీస్ రవూఫ్, నసీమ్ షా మా మెడికల్ ప్యానెల్ పరిశీలనలో ఉంటారు. వారి గాయాలు అంత తీవ్రమైనవి కావు. కానీ ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్తగా వారిద్దరి ఆడించి రిస్క్ చేయకూడదని మేము భావిస్తున్నాంయ ఈ నేపథ్యంలో షానవాజ్ దహానీ,జమాన్ ఖాన్‌లకు సిద్దంగా ఉండమని సమాచారమిచ్చాం. ఒక వేళ వీరిద్దరిని భర్తీ చేయాలని అనుకుంటే ఏసీసీ టెక్నికల్ కమిటీ అనుమతి తీసుకుంటాం" అంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది.
భారత్‌తో మ్యాచ్ సందర్భంగా హారీస్ రవూఫ్ పక్కటెముకలు పట్టేశాయి. దీంతో మ్యాచ్ సమయంలోనే కాస్త అసౌకర్యంగా కనిపించాడు. ఈ క్రమంలో రిజర్వ్ డే పోరులో బరిలోకి దిగలేదు. ఇక ఆసియా కప్‌లో రవూఫ్ ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడాడు. అందులో 9 వికెట్లు తీశాడు. అతని సగటు 13.33గా ఉంది. సూపర్ ఫోర్‌లో భాగంగా బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన ఈ పేసర్.. 6 ఓవర్లకు 19 పరుగులిచ్చి కీలకమైన నాలుగు వికెట్లను తన ఖాతాలోకి వేసుకున్నాడు.
మరోవైపు పాక్ పేస్ దళంలో కీలకమైన ప్లేయర్‌గా రాణిస్తున్న నసీమ్ షా.. భారత ఇన్నింగ్స్ 49వ ఓవర్లో భుజం గాయం కారణంగా పెవిలియన్ బాట పట్టాడు. ఇక ఈ స్టార్ ప్లేయర్ ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడగా.. అందులో 7 వికెట్లు తీశాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 34 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఆసియా కప్‌లో ఇదే అతని అత్యుత్తమ బౌలింగ్ పర్ఫార్మెన్స్.
Asia Cup 2023 : భారత్-పాక్ మ్యాచ్.. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదయ్యా!