Asia Cup 2023 PAK VS SL Dunith Wellalage : లంక యువ సంచలన స్పిన్నర్ దునిత్ వెల్లలగే ఓ అరుదైన ఘనత సాధించాడు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ 2023లో టాప్-10 ర్యాంకింగ్స్‌లో ఉన్న నలుగురు బ్యాటర్లను ఔట్ చేశాడు. వరల్డ్ నంబర్ వన్ వన్డే బ్యాటర్, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్‌తో పాటు ప్రపంచ నంబర్ 2 టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్.. నెం. 8, 9 బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను పెవిలియన్ పంపాడు.
సెప్టెంబర్ 12న టీమ్ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ, గిల్, కోహ్లీలతో పాటు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యల వికెట్లు తీశాడు వెల్లలగే. ఇప్పుడు నేడు (సెప్టెంబర్ 14) పాకిస్థాన్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో ఆ జట్టు సారథి బాబర్ అజామ్‌ను ఔట్ చేశాడు. అతడు సంధించిన బంతికి బాబర్ స్టంపౌట అయ్యాడు. 3 రోజుల వ్యవధిలోనే వరల్డ్ టాప్ క్లాస్ బ్యాటర్లను పెవిలియన్ పంపడంతో వెల్లలగేపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
గ్రూప్ దశలో బంగ్లాదేశ్‌పై ఓ వికెట్.. ఆ తర్వాత ఆఫ్ఘానిస్థాన్‌పై మరో 2 వికెట్లు తీశాడు. సూపర్-4లో బంగ్లాదేశ్‌పై మరో వికెట్.. టీమ్ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌లలో 6 వికెట్లు.. ఇలా మొత్తంగా ఈ టోర్నీలో ఇప్పటివరకు 10 వికెట్లు దక్కించుకుని.. లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు.
ఇక వెల్లలగే.. బాల్తోనే బ్యాట్‌తోనూ అద్భుత ప్రదర్శన చేయగలడు. టీమ్ఇండియా జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో తన సహచరులు స్పెషలిస్ట్ బ్యాటర్లంతా వరుసగా ఔట్ అవుతుంటే అతడు మాత్రం చివరివరకు ఒంటరిపోరాటం చేశాడు. 42 అజేయ పరుగులు చేశాడు.
Dunith Wellalage Stats : ఈ బౌలర్.. 2022లో అంతర్జాతీయత కెరీర్ ప్రారంభించాడు. టెస్ట్ కెరీర్లో ఇప్పటివరకు ఓ మ్యాచ్ ఆడి 29 పరుగులు చేశాడు. అందులో నాలుగు ఫోర్లు ఉన్నాయి. ఒక్క వికెట్ కూడా తీయలేదు. వన్డేలో మాత్రమ 187 పరుగులు చేసి 18 వికెట్లను తీశాడు.
-
Young sensation Dunith Wellalage dismantled ODI ranking No. 1, 2, 8 & 9 at the Asia Cup 2023 🌟
— CricTracker (@Cricketracker) September 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Incredible - Dunith Wellalage 🙌 pic.twitter.com/eWFBqFne0k
">Young sensation Dunith Wellalage dismantled ODI ranking No. 1, 2, 8 & 9 at the Asia Cup 2023 🌟
— CricTracker (@Cricketracker) September 14, 2023
Incredible - Dunith Wellalage 🙌 pic.twitter.com/eWFBqFne0kYoung sensation Dunith Wellalage dismantled ODI ranking No. 1, 2, 8 & 9 at the Asia Cup 2023 🌟
— CricTracker (@Cricketracker) September 14, 2023
Incredible - Dunith Wellalage 🙌 pic.twitter.com/eWFBqFne0k
Dunith Wellalage Asia Cup 2023 : భారత్‌ను హడలెత్తించిన కుర్ర స్పిన్నర్.. అసలెవరీ దునిత్ ?