Asiacup 2023 IND VS Nepal : ఆసియా కప్ 2023లో భాగంగా నేడు(సెప్టెంబర్ 4) జరుగుతున్న మ్యాచ్‌లో టీమ్ఇండియా ఫీల్డర్లు పేలవ ప్రదర్శన చేశారు. దీంతో ఈ అవకాశాన్ని నేపాల్ ఓపెనర్లు వినియోగించుకుంటూ మంచి స్కోర్ చేశారు. ఓపెనర్లు కుశాల్ భుర్తాల్(38), ఆసిఫ్ షేక్(58) మంచి స్కోర్లను అందుకుని జట్టును మెరుగైన స్థితిలో నిలిపారు. అయితే ఈ క్రమంలోనే టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ కోహ్లీ మాత్రం రెండు సూపర్ క్యాచ్‌లు పట్టారు.
Asiacup 2023 IND VS Nepal Kohli Catch : టీమ్ఇండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో రికార్డును అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆసిఫ్ షేక్ క్యాచ్ పట్టడంతో విరాట్ మల్టీ నేషనల్ వన్డే టోర్నమెంట్లలో 100 క్యాచ్‌లను పూర్తి చేసుకున్నాడు. భారత మాజీ సారథి మొహ్మద్ అజహారుద్దీన్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో నాన్ వికెట్‌కీపర్‌గా రికార్డుకెక్కాడు. నేపాల్ ఇన్నింగ్స్ 30వ ఓవర్‌లో మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో కోహ్లీ ఈ క్యాచ్‌ను పట్టుకున్నాడు. బంతి బ్యాట్ ఎడ్జ్‌కు తాకి గాల్లోకి ఎగరగా విరాట్ ఒంటి చేత్తో ఆ క్యాచ్‌ను అందుకున్నాడు. అంతకుముందు కోహ్లీ ఓసారి ఆసిఫ్ షేక్ బాదిన సునాయాస క్యాచ్‌ను జారవిడిచాడు. ఫైనల్‌గా హాఫ్ సెంచరీ సాధించి క్రీజులో పాతుకుపోయిన ఆసిఫ్ (58; 8 ఫోర్లు) వికెట్ దక్కడంతో టీమ్ఇండియా బ్రేక్ లభించినట్టైంది.
-
Kohli's mid-air magic!
— Disney+ Hotstar (@DisneyPlusHS) September 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Nepal's hopes plummet as India soars high in this crucial match! #AsiaCup23 is live now only on #DisneyPlusHotstar, free on mobile app.#FreeMeinDekhteJaao #AsiaCupOnHotstar #INDvNEP #Cricket pic.twitter.com/dYR5bilmmq
">Kohli's mid-air magic!
— Disney+ Hotstar (@DisneyPlusHS) September 4, 2023
Nepal's hopes plummet as India soars high in this crucial match! #AsiaCup23 is live now only on #DisneyPlusHotstar, free on mobile app.#FreeMeinDekhteJaao #AsiaCupOnHotstar #INDvNEP #Cricket pic.twitter.com/dYR5bilmmqKohli's mid-air magic!
— Disney+ Hotstar (@DisneyPlusHS) September 4, 2023
Nepal's hopes plummet as India soars high in this crucial match! #AsiaCup23 is live now only on #DisneyPlusHotstar, free on mobile app.#FreeMeinDekhteJaao #AsiaCupOnHotstar #INDvNEP #Cricket pic.twitter.com/dYR5bilmmq
Asiacup 2023 IND VS Nepal Rohith Catch : ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ అందుకున్న క్యాచ్ కూడా హైలైట్‌గా నిలిచింది. నేపాల్ ఇన్నింగ్స్ 20వ ఓవర్లో.. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ రోహిత్ పౌడేల్ బంతిని కాస్త తప్పుగా అంచనా వేశాడు. బ్యాక్‌ఫుట్ షాట్ ఆడబోయి ఫస్ట్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న హిట్ మ్యాన్ వైపు బాదాడు. దీంతో ఈ సింపుల్ క్యాచ్‌ను హిట్ మ్యాన్ రోహిత్ పట్టేసి.. సంబరాలు చేసుకున్నాడు. దీంతో ఇక నేపాల్ కెప్టెన్ రోహిత్(5) నిరాశగా పెవిలియన్ చేరాడు. అయితే ఇక్కడ రోహిత్ రియాక్షన్ బాగా ట్రెండ్ అయింది. ఈ రెండు క్యాచ్‌లకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. అభిమానులు వీటిని తెగ షేర్ చేస్తున్నారు.
-
A remarkable catch by Rohit Sharma has him pumped and energized. #INDvsNEP pic.twitter.com/zLu2klpiY6
— MI Fans Army™ (@MIFansArmy) September 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">A remarkable catch by Rohit Sharma has him pumped and energized. #INDvsNEP pic.twitter.com/zLu2klpiY6
— MI Fans Army™ (@MIFansArmy) September 4, 2023A remarkable catch by Rohit Sharma has him pumped and energized. #INDvsNEP pic.twitter.com/zLu2klpiY6
— MI Fans Army™ (@MIFansArmy) September 4, 2023
మూడు గోల్డెన్ క్యాచ్‌లు డ్రాప్.. శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ మూడు గోల్డెన్ క్యాచ్‌లను డ్రాప్ చేశారు. ఆసిఫ్, కుశాల్ బాదిన ఈజీ క్యాచ్‌లను వదిలేశారు. నేపాల్ ఇన్నింగ్స్ మొదటి, రెండో, ఐదో ఓవర్లో ఈ తప్పిదాలు జరిగాయి. ఈ క్రమంలోనే లైఫ్ పొందిన కుశాల్(38) చేశాడు. కానీ చివరికి పదో ఓవర్‌లో శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ చేతికే చిక్కాడు. ఇక ఆసిఫ్(58) క్యాచ్‌ను మొదటి సారి మిస్ చేసిన కోహ్లీ రెండో సారి సింగిల్ హ్యాండ్‌తోనే పట్టేశాడు.
Asia Cup 2023 : నేపాల్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన భారత్.. తుది జట్లు ఇవే
Jasprit Bumrah Baby : తండ్రిగా బుమ్రాకు ప్రమోషన్.. పేరేంటో తెలుసా?