Asia Cup 2023 Ind Vs Ban : ఆసియా కప్ సూపర్- 4లో చివరి మ్యాచ్ ప్రారంభమైంది. ఇప్పటికే పాకిస్థాన్, శ్రీలంకపై విజయాలతో ఫైనల్ చేరిన భారత్.. బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన భారత్.. బౌలింగ్ ఎంచుకుంది. ప్రత్యర్థి బంగ్లాదేశ్‌కు బ్యాటింగ్ అప్పగించింది. భారత్ తుది జట్టులో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి.
ఏకంగా ఐదు మార్పులతో..
బంగ్లాదేశ్‌తో జరిగేది నామమాత్రపు మ్యాచ్ కావడం వల్ల కొత్త వాళ్లకు ఛాన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఏకంగా ఐదు మార్పులు చేసింది మేనేజ్మెంట్. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్, సిరాజ్, బుమ్రా, హార్దిక్ పాండ్యలకు రెస్ట్ ఇవ్వడం విశేషం. వాళ్ల స్థానంలో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ తుది జట్టులోకి వచ్చారు. వెస్టిండీస్ టూర్లో టీ20 క్రికెట్లోకి అరంగేట్రం చేసిన తిలక్ వర్మ.. ఇప్పుడు వన్డేల్లో అడుగుపెడుతున్నాడు.
-
🚨 Toss & Team News 🚨
— BCCI (@BCCI) September 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Captain @ImRo45 has won the toss & #TeamIndia have elected to bowl against Bangladesh.
A look at our Playing XI 🔽
Follow the match ▶️ https://t.co/OHhiRDZM6W #AsiaCup2023 | #INDvBAN pic.twitter.com/SD6uyPHud3
">🚨 Toss & Team News 🚨
— BCCI (@BCCI) September 15, 2023
Captain @ImRo45 has won the toss & #TeamIndia have elected to bowl against Bangladesh.
A look at our Playing XI 🔽
Follow the match ▶️ https://t.co/OHhiRDZM6W #AsiaCup2023 | #INDvBAN pic.twitter.com/SD6uyPHud3🚨 Toss & Team News 🚨
— BCCI (@BCCI) September 15, 2023
Captain @ImRo45 has won the toss & #TeamIndia have elected to bowl against Bangladesh.
A look at our Playing XI 🔽
Follow the match ▶️ https://t.co/OHhiRDZM6W #AsiaCup2023 | #INDvBAN pic.twitter.com/SD6uyPHud3
తిలక్ వర్మ అరంగేట్రం
Tilak Varma ODI Debut : ఈ టోర్నీలో ఇప్పటి వరకు కూడా మొదట ఫీల్డింగ్ చేసే అవకాశం రాకపోవడం వల్ల టాస్ గెలవగానే ఫీల్డింగ్ ఎంచుకున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. టాస్ కంటే ముందు రోహిత్.. తిలక్ వర్మకు ఇండియా క్యాప్ అందించాడు. ఆసియా కప్‌లో ఇప్పటి వరకూ అసలు అవకాశం దక్కని సూర్యకుమార్, ప్రసిద్ధ్ కృష్ణకు కూడా అవకాశం ఇచ్చారు. భారత్ ఇప్పటికే ఫైనల్ చేరడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా మారింది. అయితే బంగ్లాదేశ్‌తో ఈ మ్యాచ్ ఇండియాకు మంచి ప్రాక్టీస్‌గా పనికి రానుంది.
-
#AsiaCup2023 | Tilak Varma receives his Team India ODI cap from captain Rohit Sharma
— ANI (@ANI) September 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
(Pics: BCCI Twitter) pic.twitter.com/cHvABrrvGL
">#AsiaCup2023 | Tilak Varma receives his Team India ODI cap from captain Rohit Sharma
— ANI (@ANI) September 15, 2023
(Pics: BCCI Twitter) pic.twitter.com/cHvABrrvGL#AsiaCup2023 | Tilak Varma receives his Team India ODI cap from captain Rohit Sharma
— ANI (@ANI) September 15, 2023
(Pics: BCCI Twitter) pic.twitter.com/cHvABrrvGL
భారత జట్టు ఇదే
Team India Squad : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ.
బంగ్లాదేశ్ జట్టు ఇదే
Bangladesh Squad : లిట్టన్ దాస్ (వికెట్ కీపర్), తాజిద్ హసన్, అనముల్ హక్, షకీబ్ అల్ హసన్(కెప్టెన్), తౌహిద్ హ్రిడోయ్, షమీమ్ హొస్సేన్, హసన్ మిరాజ్, మహేది హసన్, నౌషమ్ అహ్మద్, తంజిమ్ హసన్ షకీబ్, ముఫ్తికర్ రెహమాన్.
ICC ODI Rankings : పాకిస్థాన్‌కు షాకిచ్చిన టీమ్‌ఇండియా.. నెం.1గా ఆసీస్.. కొత్త లెక్కలు ఇవే!