Asia Cup 2022 : పాకిస్థాన్‌తో ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఓపెనర్ల దూకుడు, కోహ్లీ క్లాస్ ఆటతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 181 పరుగులు చేసింది. అయితే ఈ క్రమంలోనే వీరు పలు రికార్డులను అందుకున్నారు. తొలుత స్టార్ ఓపెనర్లు రోహిత్(28; 16 బంతుల్లో), రాహుల్(28; 20 బంతుల్లో) చెలరేగి ఆడారు. దీంతో 5 ఓవర్లలోపే 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అంతర్జాతీయ టీ20ల్లో వీరు 50 ప్లస్ పరుగులు జోడించడం ఇది 14వ సారి. ఇందులో 100కుపైగా భాగస్వామ్యాలు 5 ఉన్నాయి. ఇప్పటివరకు వీరిదే అత్యుత్తమం.
ఐర్లాండ్‌కు చెందిన కెవిన్ ఓబ్రియాన్- పాల్ స్టిర్లింగ్ జోడీ 13 సార్లు 50కుపైగా పరుగులు జోడించి రెండో స్థానంలో ఉంది. కివీస్‌కు చెందిన మార్టిన్ గప్తిల్- కేన్ విలియమ్సన్ కలిసి 12 సార్లు 50 ప్లస్ పరుగులు జోడించారు. పాక్ స్టార్ ఓపెనర్లు బాబర్ ఆజామ్- మహ్మద్ రిజ్వాన్(11) ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నారు.
రోహిత్‌ను దాటిన విరాట్..: ఆసియా కప్‌లో మునుపటి ఫామ్ అందుకున్నట్లు కనిపిస్తున్న భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మళ్లీ రికార్డుల బాట పట్టాడు. పాకిస్థాన్‌పై హాఫ్ సెంచరీతో రాణించిన కోహ్లీ.. అంతర్జాతీయ టీ-20ల్లో అత్యధిక సార్లు 50 ప్లస్ స్కోరు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు విరాట్ టీ20ల్లో 32 అర్ధసెంచరీలు చేశాడు.
భారత్‌కే చెందిన మరో ఓపెనర్ రోహిత్ శర్మ.. 31 సార్లు 50కిపైగా పరుగులు చేసి ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. పాక్ సారథి బాబర్ ఆజామ్(27), ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్(23), న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్(22), ఐర్లాండ్ క్రికెటర్ పాల్ స్టిర్లింగ్(21) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఇవీ చదవండి: దాయాదితో పోరుకు సిద్ధం.. జడేజా స్థానాన్ని భర్తీ చేసేదెవరు?