ETV Bharat / sports

భారత్ పాక్ మ్యాచ్, టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రోహిత్ సేన

ASIA CUP 2022 INDIA VS PAKISTAN MATCH TOSS

author img

By

Published : Aug 28, 2022, 7:04 PM IST

Updated : Aug 28, 2022, 7:41 PM IST

18:58 August 28

భారత్ పాక్ మ్యాచ్, టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రోహిత్ సేన

కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తున్న భారత్- పాకిస్థాన్ మ్యాచ్​కు రంగం సిద్ధమైంది. టాస్ గెలిచిన రోహిత్ సేన బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుత ఆసియా కప్ టోర్నీ​లో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్. దీంతో ఎలాగైనా గెలిచి తీరాలని రెండు జట్లు కంకణం కట్టుకున్నాయి. చాలా రోజుల తర్వాత టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగనుండటం వల్ల.. ఈ మ్యాచ్​పై అందరి ఆసక్తి నెలకొంది. ఇది కోహ్లీకి వందో అంతర్జాతీయ టీ20 మ్యాచ్. దీంతో ఈ మ్యాచ్​లోనైనా కోహ్లీ తన మునుపటి ఫామ్​ను అందుకుంటాడేమోనని అభిమానులు గంపెడు ఆశలతో ఎదురుచూస్తున్నారు.

అయితే, టీమ్ సెలక్షన్ విషయంలో రోహిత్- ద్రావిడ్ అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు. పంత్​కు బదులు దినేశ్ కార్తీక్​ను జట్టులోకి తీసుకున్నారు. ఇది కఠినమైన నిర్ణయమని, దురదృష్టవశాత్తు పంత్​ను ఆడించలేకపోతున్నామని టాస్ సమయంలో రోహిత్ చెప్పాడు. ఇక అదనపు స్పిన్నర్​కు బదులు మూడో పేసర్​గా అవేష్ ఖాన్​ను తీసుకున్నారు.

జట్లు
భారత్:
రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దినేశ్ కార్తీక్ (కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్

పాకిస్థాన్:
బాబర్ ఆజమ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(కీపర్), ఫఖర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్దిల్ షా, ఆసిఫ్ అలీ, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, నసీమ్ షా, హరీస్ రవూఫ్, షానవాజ్ దహానీ

Last Updated : Aug 28, 2022, 7:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.