Ashes 2023 : ఓవల్ వేదికగా యాషెస్ సిరీస్ చివరి టెస్టు మూడో రోజు.. ఇంగ్లాండ్ ప్లేయర్లు తమ జట్టులోని ఇతరుల పేర్లతో ఉన్న జెర్సీలు ధరించారు. తమ పేరుతో కాకుండా సహచర ఆటగాళ్ల జెర్సీలతో మైదానంలోకి దిగిన ప్లేయర్లను చూసి.. ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఇక మ్యాచ్ జరుగుతుండగా వారిని మైదానంలో చూసిన అభిమానులు గందరగోళానికి గురయ్యారు.
-
A moving and powerful rendition of Jerusalem 👏@alzheimerssoc | #CricketShouldBeUnforgettable pic.twitter.com/cMC37JWC96
— England Cricket (@englandcricket) July 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">A moving and powerful rendition of Jerusalem 👏@alzheimerssoc | #CricketShouldBeUnforgettable pic.twitter.com/cMC37JWC96
— England Cricket (@englandcricket) July 29, 2023A moving and powerful rendition of Jerusalem 👏@alzheimerssoc | #CricketShouldBeUnforgettable pic.twitter.com/cMC37JWC96
— England Cricket (@englandcricket) July 29, 2023
ఇక వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో.. కెప్టెన్ బెన్‌స్టోక్ జెర్సీ వేసుకోగా.. పేసర్ జేమ్స్ అండర్సన్.. మరో ఆటగాడు స్టార్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ పేరుతో ఉన్న జెర్సీలో కన్పించాడు. కాగా స్పిన్నర్ మెయిన్ అలీ.. క్రిస్ వోక్స్ పేరున్న జెర్సీ ధరించాడు. అలాగే జో రూట్.. మార్క్ వుడ్ జెర్సీలో కనిపించాడు.
ఇలా జట్టులోని మిగత ప్లేయర్లందరూ.. కూడా తమ పేరుతో ఉన్నవి కాకుండా ఇతర ఆటగాళ్ల జెర్సీలతో మైదానంలో దర్శనిమిచ్చారు. అయితే ఆటగాళ్లందరూ ఇలా చేయడం వెనుక బలమైన కారణమే ఉంది. డిమెన్షియా అనే వ్యాధితో బాధపడేవారికి ఆటగాళ్లంతా ఇలా వేరే జెర్సీలో కనిపించి.. మద్దతు తెలిపినట్లు ఇంగ్లాండ్ జట్టు అసిస్టెంట్ కోచ్ మార్కస్ ట్రెస్‌కోథిక్ తెలిపాడు.
-
Swapping shirts to support @alzheimerssoc ❤️#CricketShouldBeUnforgettable
— England Cricket (@englandcricket) July 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Donate here: https://t.co/n1u2juI3tL pic.twitter.com/yBaAVWGxkb
">Swapping shirts to support @alzheimerssoc ❤️#CricketShouldBeUnforgettable
— England Cricket (@englandcricket) July 29, 2023
Donate here: https://t.co/n1u2juI3tL pic.twitter.com/yBaAVWGxkbSwapping shirts to support @alzheimerssoc ❤️#CricketShouldBeUnforgettable
— England Cricket (@englandcricket) July 29, 2023
Donate here: https://t.co/n1u2juI3tL pic.twitter.com/yBaAVWGxkb
అయితే ఇంగ్లాంగ్ క్రికెట్ బోర్డు, అల్జీమర్స్ సొసైటీ కలిసి.. అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోచ్ మార్కస్ ట్రెస్‌కోథిక్ తెలిపాడు. " ఈ అల్జీమర్స్ వ్యాధి చాలా భయంకరమైనది. ఈ వ్యాధి సోకిన రోగులకు జ్ఞాపకశక్తి క్షిణిస్తుంది. అంతేకాకుండా వారు తీవ్ర గందరగోళానికి గురవుతారు. అయితే ఈ అల్జీమర్స్ వ్యాధిపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో.. మా ప్లేయర్లు అందరూ జెర్సీలు మార్చుకున్నారు. ఈ ప్రయత్నం వల్ల ఎక్కువ మందికి.. అల్జీమర్స్ వ్యాధిపై అవగాహన వస్తుందని ఆశిస్తున్నాం. ఇందులో భాగంగా విరాళాలు కూడా సేకరిస్తున్నాం" అని మార్కస్ తెలిపాడు.
ప్రతిష్ఠాత్మక యాషెస్ టెస్టు ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా.. మొదటి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గింది. తర్వాత ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు పుంజుకొని మూడో మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో సజీవంగా నిలిచింది. కాగా నాలుగో మ్యాచ్ వర్షం కారణంగా డ్రా గా ముగిసింది. కాగా చివరి మ్యాచ్.. ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరీగా కొనసాగుతోంది.
రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లాండ్.. ప్రత్యర్థికి గౌరప్రదమైన టార్గెట్‌ను నిర్దేశించే దిశగా సాగుతోంది. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్.. 42 ఓవర్లకు 227/4తో ఉంది. ఓపెనర్ జాక్ క్రాలీ (73), జో రూట్ (56 నాటౌట్) అర్ధశతకాలు సాధించారు. మరో ఓపెనర్ బెన్ డకెట్ (42), కెప్టెన్ బెన్ స్టోక్స్ (42) పరుగులతో రాణించారు. ఆసిస్ బౌలర్లలో స్టార్క్, హజెల్‌వుడ్, కమిన్స్, టాడ్ మర్ఫీ తలో వికెట్ పడగొట్టారు.