Aryan Dutt Netherlands : 2011 ప్రపంచకప్.. శ్రీలంక, భారత్ మధ్య ఫైనల్ జరుగుతున్న సమయం. దిల్లీలోని ఓ ఇంట్లో.. టీవీ ముందు కూర్చున్న ఓ ఎనిమిదేళ్ల బాలుడు తీక్షణంగా మ్యాచ్‌ను చూస్తున్నాడు. ధోని సిక్సర్‌తో జట్టు గెలవడం వల్ల ఆ చిన్నారి ఆనందంలో ఉబ్బితబ్బిపోయాడు. వెంటనే తన తండ్రితో క్రికెట్ ఆడతానని చెప్పాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ భుజాల మీద సచిన్ ఊరేగుతుంటే చూసి వెంటనే బ్యాట్ కొనివ్వమని తండ్రిని కోరాడు. ఇలా ఓ మ్యాచ్‌లో చూసిన ఘటనలతో క్రికెట్‌పై ప్రేమ పెంచుకున్న ఆ బాలుడు మరెవరో కాదు.. ఇప్పుడు నెదర్లాండ్స్ జట్టులో ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్న యంగ్ క్రికెటర్ ఆర్యన్ దత్.
ప్రపంచకప్‌లో రాణిస్తున్న ఈ 20 ఏళ్ల ప్లేయర్.. దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్స్ సంచలన విజయంలో కీలక పాత్ర పోషించాడు. దిల్లీలో క్రికెట్ ప్రయాణం మొదలెట్టినప్పటికీ.. వలస వెళ్లి నెదర్లాండ్స్‌లో ఆ జర్నీని కొనసాగించడం అతనికి కష్టంగా మారింది. ఆర్యన్ కుటుంబం ఉండే డెన్ హాగ్‌లో క్రికెట్‌కు ఆదరణే లేదు. దీంతో దగ్గరలోని బాస్కెట్‌బాల్ కోర్టులో తండ్రి బంతులు విసురుతుంటే ఆర్యన్ బ్యాటింగ్ చేసేవాడు. కానీ ఒకరోజు మాజీ క్రికెటర్ టిమ్ డీ లీడ్ (బాస్ డీ లీడ్ తండ్రి) ఆర్యన్‌ను చూసి వూర్‌బర్గ్ క్రికెట్ క్లబ్ అకాడమీకి తీసుకురమ్మని చెప్పాడు. అయితే ఆ దేశంలో మార్చి నుంచి సెప్టెంబర్ వరకే క్రికెట్ సీజన్ ఉండేది.
దీంతో విక్రమ్‌జీత్ (మరో నెదర్లాండ్స్ ఆటగాడు)తో కలిసి 2015 నుంచి 2019-20 వరకు ఏటా ఆరు నెలల పాటు ట్రైనింగ్ కోసం ఆర్యన్ చండీగఢ్‌కు వచ్చేవాడు. తక్కువ సమయంలోనే ఎక్కువ ఎత్తు పెరగడం వల్ల ఆర్యన్ కోసం కొత్త బూట్లు కొనడం వాళ్ల ఇంట్లో వాళ్లకు కష్టమయ్యేది. దీంతో పాత బూట్లతోనే ఆడటం వల్ల అతను సరిగ్గా పరుగెత్తలేకపోయాడు. ఈ క్రమంలో తక్కువ దూరం నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి ఆఫ్‌స్పిన్ వేయడం మొదలెట్టాడు. అశ్విన్, హర్భజన్, లైయన్ వీడియోలు చూసి స్పిన్ బౌలింగ్ స్కిల్స్‌ను మెరుగుపరుచుకున్నాడు. ఇక ధోని, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆర్యన్ వీరాభిమాని. తన తొలన బౌలింగ్ కోచ్ తండ్రి రాకేష్ కావడం విశేషం. మంచి హిట్టర్ కూడా అయిన ఆర్యన్.. ఎంగిడి, రబాడ, కోయెట్జీ బౌలింగ్‌లో సిక్సర్లు కొట్టి అందరిని ఆశ్చర్యపరిచాడు.
ICC World Cup 2023 : వరల్డ్ కప్‌లో టాప్ 5 నెదర్లాండ్స్ ప్లేయర్స్.. వీరిని ఎదుర్కోవడం కష్టమే!