ETV Bharat / sports

ఆర్చర్​కు మళ్లీ సర్జరీ.. ఆటకు 4 వారాలు దూరం

దాదాపు ఆర్నెళ్ల నుంచి మోచేతి సమస్యతో బాధపడుతున్న ఇంగ్లాండ్ క్రికెటర్​ జోఫ్రా ఆర్చర్​.. మరో సర్జరీ చేయించుకున్నాడు. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

jofra archer, endland all rounder
జోఫ్రా ఆర్చర్, ఇంగ్లాండ్ ఆల్​రౌండర్
author img

By

Published : May 26, 2021, 7:52 PM IST

చాలాకాలం నుంచి మోచేతి గాయంతో బాధపడుతున్న ఇంగ్లాండ్ ఆల్​రౌండర్ జోఫ్రా ఆర్చర్​.. శుక్రవారం మరోసారి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. అతడు తిరిగి ప్రాక్టీస్ ఎప్పుడు మొదలుపెట్టనున్నాడనేది మాత్రం చెప్పలేదు.

"ఇంగ్లాండ్, ససెక్స్ జట్టు బౌలర్ జోఫ్రా ఆర్చర్.. మోచేతికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. మా వైద్య బృందాలు అతడి పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా పరిశీలిస్తున్నాయి. కానీ, అతడు ఎప్పుడు బౌలింగ్​ చేస్తాడనేది మాత్రం ఇప్పుడే చెప్పలేం" అని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు పేర్కొంది.

సర్జరీ అనంతరం ఆర్చర్​ పూర్తి ఫిట్​నెస్​తో జట్టులోకి రావాలని ఇంగ్లాండ్ కోరుకుంటోంది. ఈ ఏడాది ఆఖర్లో జరగబోయే టీ20 ప్రపంచకప్​తో పాటు యాషెస్​ సిరీస్​ల్లో రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ గాయం కారణంగా ఆర్చర్​.. గతేడాది దక్షిణాఫ్రికా సిరీస్​తో పాటు ఇండియా పర్యటన నుంచి అర్ధాంతరంగా వైదొలిగాడు.

ఇదీ చదవండి: 'ధోనీ వీడ్కోలు​ తర్వాతే నాకు వరుస అవకాశాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.