ETV Bharat / sports

'సచిన్​ను తొలిసారి చూసి చిన్నపిల్లాడు అనుకున్నా' - అంజలి

తన భర్త సచిన్​ తెందూల్కర్​ను తొలిసారి చూసిన అనుభవాన్ని పంచుకుంది అంజలి. అప్పటికీ అతడెవరో తెలియకున్నా.. క్యూట్​గా ఉండడం వల్ల అతని వెంట పడ్డట్లు వెల్లడించింది.

sachin tendulkar, anjali
సచిన్ తెందుల్కర్, అంజలి
author img

By

Published : Jun 9, 2021, 5:42 PM IST

సచిన్​ తెందుల్కర్​ను తొలిసారి చూసిన అనుభవం గురించి గుర్తు చేసుకుంది అతని భార్య అంజలి. ఇంగ్లాండ్ పర్యటన అనంతరం స్వదేశానికి వచ్చిన లిటిల్ మాస్టర్​ను మొదటగా ముంబయి ఎయిర్​పోర్ట్​లో చూశానని వెల్లడించింది. అప్పటికీ అతడెవరో తనకు తెలియదని తెలిపింది. అప్పుడు 17 ఏళ్ల సచిన్..​ తనకి 12 ఏళ్ల పిల్లాడిలా కనిపించాడని అంజలి తెలిపింది.

"అప్పుడు నాకు అతడెవరో తెలీదు. నా ఫ్రెండ్​ అపర్ణ నాతో పాటు ఉంది. నాకు అతని గురించి చెప్పింది. క్రికెట్​లో అతడొక అద్భుతమని.. అతి చిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడు అని తెలిపింది. క్రికెట్ పట్ల నాకు ఆసక్తి లేదు. అందుకే అతడెవరైతే నాకెంటని అనుకున్నా. కానీ, సచిన్​ క్యూట్​గా అనిపించి.. అతని వెంట పరుగెత్తా" అని అంజలి ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది.

ఇదీ చదవండి: 'టీవీలో సచిన్ ఆట చూసి ఆ షాట్లు నేర్చుకున్నా'

"ఆ రోజుల్లో ఎయిర్​పోర్ట్​ల్లో వీక్షకుల గ్యాలరీ ఉండేది. ఇంగ్లాండ్ నుంచి రావాల్సిన మా అమ్మ కోసం నేను ఎదురుచూస్తున్నా. అప్పుడే అతన్ని చూశా. అమ్మ గురించి మర్చిపోయా. అతని పేరు పిలుస్తూ అతని వెంట పరుగెత్తా. ఆ సమయంలో సచిన్​తో పాటు నితిన్​, అజిత్​ ఉన్నారు. అతడు నా వంక కూడా చూడలేదు. నా వైపు చూడకుండానే కారులోకి ఎక్కాడు" అని అంజలి వెల్లడించింది.

1995లో తెందూల్కర్​.. అంజలిని పెళ్లి చేసుకున్నాడు. ఆ దంపతులకు సారా, అర్జున్​ అనే ఇద్దరు పిల్లలున్నారు.

ఇదీ చదవండి: ICC Rankings: కోహ్లీ, రోహిత్​ స్థానాలు పదిలం.. కాన్వే రికార్డు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.