ETV Bharat / sports

మొత్తానికి నా కల నెరవేరింది: సమంత - సమంత అప్డేట్స్​

హీరోయిన్ (Samantha Latest News) సమంత.. స్నేహితులతో కలిసి చేపట్టిన తీర్థయాత్రలో 'ఛార్‌ధామ్‌ యాత్ర' (గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్‌, బద్రినాథ్‌) పుణ్యక్షేత్రాల సందర్శనను పూర్తి చేసుకున్నారు. యాత్ర గురించి చెబుతూ "మొత్తానికి నా కల నెరవేరింది" అని అన్నారు.

sam
సమంత, ఫ్యాషన్‌ డిజైనర్‌ శిల్పారెడ్డి
author img

By

Published : Oct 23, 2021, 3:51 PM IST

Updated : Oct 23, 2021, 4:02 PM IST

టాలీవుడ్ కథానాయిక సమంత(chaysam divorce date).. నాగచైతన్యతో వైవాహిక జీవితానికి ముగింపు పలికిన తరువాత.. కెరీర్‌ పై దృష్టి పెట్టింది. వరుసగా తన తదుపరి చిత్రాల అప్‌డేట్‌ను దసరా రోజు ప్రకటించింది(chaysam divorce). ఇటీవలే సామ్‌.. తన స్నేహితురాలు, ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ శిల్పారెడ్డితో కలిసి 'ఛార్‌ధామ్‌ యాత్ర' (గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్‌, బద్రినాథ్‌) పుణ్యక్షేత్రాల సందర్శనను పూర్తి చేసుకున్నారు. శనివారం ఇదే విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు(samantha updated news). యాత్ర గురించి చెబుతూ "నా జీవితంలో హిమాలయాలకు ప్రత్యేక స్థానం ఉంది. మహాభారతం చదివినప్పటి నుంచి హిమాలయాల గురించి ఆకర్షితులరాలినయ్యాను. భూమి పై ఉన్న ఈ స్వర్గం, దేవుళ్ల నివాసం, గొప్ప రహస్యమే ఈ ప్రదేశం. ఎప్పటికైనా వీటిని చూడాలనే కల ఈ రోజుతో నెరవేరింది. అనుకున్నట్లు గానే దేవతల నిలయమైన ఈ అందమైన భూలోక స్వర్గాన్ని చూశాను. ఈ ట్రిప్‌ అంతా మరింత స్పెషల్‌గా నిలవడానికి కారణం నా స్నేహితురాలు, సోదరి శిల్పారెడ్డితో కలిసి చూడటం వల్లే" అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

రిషికేష్‌లో..

రిషికేష్‌లోకి అడుగుపెట్టిన సామ్ అక్కడ సందర్శించిన ప్రఖ్యాత మహర్షి మహేష్‌ యోగి ఆశ్రమ విశేషాల గురించి చెబుతూ... 'ది బీటెల్స్‌'( ఇంగ్లిష్‌ రాక్‌ బ్యాండ్‌) నడిచిన చోట అడుగుపెట్టా. ఇక్కడే వారు ధ్యానం చేసేవారట. ఇక్కడే కూర్చొని ప్రసిద్ధి చెందిన పాటలు రాశారట. వీటన్నింటికీ నేను పెద్ద అభిమానిని" అని చెప్పింది.

ఇదీ చూడండి: విడాకుల అనంతరం తీర్థయాత్రలో సమంత

Last Updated : Oct 23, 2021, 4:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.