టీమ్ఇండియా బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మను(Rohith Sharma Centuries) ప్రశంసించింది ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ అలిస్సా హేలీ(Alyssa Healy). అన్ని ఫార్మాట్లలో మెరుగైన బ్యాటింగ్ చేయాలంటే.. హిట్‌మ్యాన్ ఆటతీరును అనుసరించాలని చెప్పింది. ఈ పద్ధతినే తాను అవలంబించనున్నట్లు పేర్కొంది.
"టెస్ట్‌లో కంఫర్ట్‌గా ఆడుతానని చెప్పలేను. ఎందుకంటే ఇప్పటివరకు నేను నాలుగు టెస్టులు మాత్రమే ఆడాను. అయినా.. పెద్దగా మార్పు లేకుండా వన్డే తరహాలోనే ఆడాను. మోడ్రన్ టెస్ట్ క్రికెట్లో మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నాను. పురుషుల క్రికెట్ ఎక్కువగా చూస్తాను. ముఖ్యంగా రోహిత్ శర్మ్ బ్యాటింగ్ తీరు బాగా గమనిస్తాను. అతను ప్రపంచంలో ఉన్న విధ్వంసకర బ్యాట్స్మెన్లలో ఒకడు. అతడిని అనుసరిస్తే.. అన్ని ఫార్మాట్లలో బాగా రాణించగలం."
--అలిస్సా హేలీ, ఆస్ట్రేలియా ఓపెనర్.
భారత్‌తో ఆడటం చాలా ఆసక్తికరంగా ఉంటుందని అలిస్సా తెలిపింది. ఈ టూర్ కోసం భారత్ కొత్త ఆటగాళ్లను ఎంపిక చేసిందని పేర్కొంది.
త్వరలోనే మూడు వన్డేలు, ఓ డే నైట్ టెస్టు, మూడు టీ20 మ్యాచ్‌ల్లో భారత్, ఆస్ట్రేలియా(Australia vs India Women's Cricket) మహిళా జట్లు తలపడనున్నాయి. మొదటి వన్డే సెప్టెంబర్ 21న ప్రారంభం కానుంది.
ఇదీ చదవండి: