ఐపీఎల్ 2022 మెగా వేలం(IPL 2022 Auction) నేపథ్యంలో టీమ్ఇండియా మేటి ఆటగాళ్లను తమ జట్టుతోనే అట్టిపెట్టుకునేందుకు ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. ఇలా చేస్తే రెండు కొత్త ఫ్రాంచైజీలకు(IPL New Team Auction) ఆటగాళ్ల ఎంపిక క్లిష్టంగా మారుతుందని మాజీ ఆటగాడు, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా(Aakash Chopra News) అభిప్రాయపడ్డాడు. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు ఓ సలహా ఇచ్చాడు.
"ఐపీఎల్లో ప్రతి జట్టులో ఐదుగురు విదేశీ ఆటగాళ్లను చేర్చుకోవాలి. ప్రస్తుతం ఒక్కో జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లు మాత్రమే ఉన్నారు. విదేశీ ఆటగాళ్లు ఎక్కువగా ఉంటే భారత ఆటగాళ్లలో పోటీతత్వం కాస్త తగ్గిపోతుంది. ఫ్రాంచైజీలు మొత్తం భారతీయ ఆటగాళ్లనే ఉంచాలని భావిస్తాయి. కానీ, జట్టులో విదేశీ ఆటగాళ్లుండటం అవసరం. వారు ఆడతారా? లేదా? అనేది తర్వాత విషయం."
-ఆకాశ్ చోప్రా, వ్యాఖ్యాత.
కొత్త ఫ్రాంచైజీలకూ కీలక ఆటగాళ్లను తీసుకునే అవకాశం రావాలని ఈ విధంగా మాట్లాడాడు ఆకాశ్ చోప్రా(Aakash Chopra latest). "ప్రతి జట్టు వేలానికి ముందు కనీసం ముగ్గురు భారత ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నా.. 24 మంది ఆక్షన్‌లో పాల్గొనే అవకాశం ఉండదు. ఇలా చేస్తే టీమ్ఇండియా మేటి ఆటగాళ్లను తీసుకునే అవకాశం కొత్త జట్లకు ఎలా వస్తుంది?" అని ఆకాశ్ ప్రశ్నించాడు. ఇలాంటి పరిస్థితుల్లో వేరే అవకాశం లేక ఏర్పడే కొత్త జట్టు అంత దృఢంగా ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. ఈ సమస్యను అధిగమించేందుకు ఐదుగురు విదేశీ ఆటగాళ్లను జట్టులోకి తీసుకుని క్రమంగా భారత ఆటగాళ్ల సంఖ్యను పెంచుకోవాలని సూచించాడు.
రెండు జట్లు ఇవే..
ఐపీఎల్ 2022లో మొత్తం 10 జట్లు టైటిల్ పోరులో నిలబడనున్నాయి. కొత్తగా అహ్మదాబాద్, లఖ్‌నవూ జట్లు చేరినట్లు బీసీసీఐ ప్రకటించింది. అహ్మదాబాద్‌ను సీవీసీ క్యాపిటల్స్ పార్టనర్స్ దక్కించుకోగా, లఖ్‌నవూ.. ఆర్పీఎస్జీ గ్రూప్‌నకు దక్కింది. సీవీసీ క్యాపిటల్స్ పార్టనర్స్ ₹5,625 కోట్లకు, ఆర్పీఎస్జీ గ్రూప్ 7,090 కోట్లతో ఈ ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి.
ఇదీ చదవండి: