శ్రీలంకతో టీమ్ ఇండియా పరిమిత ఓవర్ల సిరీస్ యథావిధిగా జరిగే అవకాశాలున్నాయి. తాజాగా నిర్వహించిన ఆర్టీ- పీసీఆర్ పరీక్షల్లో లంక జట్టు ప్రధాన ఆటగాళ్లందరికీ కరోనా నెగెటివ్‌గా తేలింది. ఇందులో కుశార్ పెరీరా, చమీరా, ధనంజయ డి సిల్వా ఉన్నారు. శ్రీలంక క్రికెట్(ఎస్ఎల్సీ) బోర్డు ఆధ్వర్యంలో.. కరోనా పరీక్షలు జరిపారు.
ఇటీవలే ఇంగ్లాండ్‌లో సిరీస్ ముగించుకొని స్వదేశానికి వచ్చిన ఆటగాళ్లంతా వారం రోజుల పాటు కఠిన క్వారంటైన్లో ఉన్నారు. ఇప్పుడు నెగెటివ్‌గా తేలటం వల్ల.. సోమవారం బయోబబుల్‌లోకి అడుగుపెట్టనున్నారు.
వారికి కరోనాతో..
ఇప్పటికే శ్రీలంక బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్, డాటా అనలిస్ట్ నీరోషన్తో పాటు మరో ఆటగాడికి కరోనా సోకగా.. భారత్- లంక సిరీస్ జులై 18కి వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం.. జులై 13 నుంచే సిరీస్ జరగాల్సి ఉంది.
ఇదీ చదవండి: టీమ్ఇండియా-శ్రీలంక తొలి వన్డే జులై 18న