ETV Bharat / sports

INDvsENG 4th Test: గెలుపే లక్ష్యంగా రెండు జట్లు! - భారత్ ఇంగ్లాండ్ నాలుగో టెస్టు టాస్

నేడు (గురువారం) భారత్-ఇంగ్లాండ్ (INDvsENG) మధ్య నాలుగో టెస్టు(ind vs eng 4th test 2021) ప్రారంభంకానుంది. లండన్ ఓవల్ వేదికగా జరగబోయే ఈ మ్యాచ్​లో ఇరుజట్లు గెలుపే లక్ష్యంగా బరిలో దిగుతున్నాయి.

INDvsENG
భారత్
author img

By

Published : Sep 2, 2021, 5:31 AM IST

నాటింగ్​హామ్​ టెస్టులో గెలుస్తుందనుకున్న మ్యాచ్​ డ్రా. లార్డ్స్​లో ఘనవిజయం. లీడ్స్​లో ఘోర పరాజయం.. ఇలా మూడు టెస్టుల్ని మూడు విభిన్న పంథాల్లో ముగించిన టీమ్ఇండియా నాలుగో టెస్టు(ind vs eng 4th test 2021)కు సిద్ధమైంది. లండన్ ఓవల్ వేదికగా జరిగే మ్యాచ్​ కోసం గెలుపు వ్యూహాలు సిద్ధం చేసింది. చివరి మ్యాచ్​లో ఓటమి కసితో ఉన్న కోహ్లీసేన గెలుపు ఉత్సాహంతో జోరుమీదున్న రూట్​సేనను ఏమేరకు అడ్డుకుంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల బలాలు, బలహీనతలపై ఓ లుక్కేద్దాం.

త్రిమూర్తుల ఫామ్​ ఎంతవరకు!

మొదటి రెండు టెస్టుల్లో విఫలమైన పుజారా, కోహ్లీ(virat kohli) మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్​లో పర్వాలేదనిపించారు. రహానే మాత్రం ఇంకా తన ఫామ్​ నిరూపించుకోలేదు. కోహ్లీ కూడా సెంచరీ చేసి 50కిపైగా ఇన్నింగ్స్​లు గడిచాయి. లీడ్స్​లో జరిగిన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్​లో 55 పరుగులతో మెరిశాడు. కానీ ఎడంగా వెళుతున్న బంతిని ఆడి ఔటై మరోసారి తన బలహీనతను బయటపెట్టాడు. పుజారా కూడా చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్​లో అద్భుతంగా ఆడాడు. తన పంథాను మార్చి కాస్త వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. లండన్ టెస్టులో గెలవాలంటే వీరిద్దరూ.. మరోసారి బ్యాట్​కు పని చెప్పాల్సిన అవసరం ఉంది.

రహానే ఉంటాడా?

చివరి మూడు టెస్టుల్లో లార్డ్స్​ టెస్టు రెండో ఇన్నింగ్స్​లో చేసిన 61 పరుగులు మాత్రమే రహానేకు చెప్పుకోదగ్గవి. ఫామ్​తో సంబంధం లేకుండా రెండేళ్లుగా రహానేకు అవకాశాలు వస్తున్నా.. జట్టును మాత్రం ఆదుకోవడంలో విఫలమవుతున్నాడు. దీంతో లండన్ టెస్టులో ఇతడి స్థానంలో సూర్య కుమార్ యాదవ్ లేదా హనుమ విహారీని తీసుకోవాలని యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఐదుగురు బౌలర్లకు స్వస్తి

ఆడిన మూడు టెస్టులో ఐదుగురు బౌలర్లతో ప్రయోగం చేసిన టీమ్ఇండియా చివరి టెస్టులో మాత్రం పూర్తిగా విఫలమైంది. టాపార్డర్​లో రోహిత్(rohit sharma), రాహుల్ జట్టుకు శుభారంభాల్ని అందిస్తున్నారు. కానీ మిడిలార్డర్ విఫలమైతే ఇన్నింగ్స్​ను గాడినపెట్టగల ఓ ఆల్​రౌండర్​ దొరకడం లేదు. ఈ నేపథ్యంలో ఆరుగురు బ్యాట్స్​మెన్​తో బరిలో దిగాలని పలువురు మాజీలు సూచిస్తున్నారు.

అశ్విన్​కు చోటు

లండన్ ఓవల్ పిచ్​ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని సమాచారం. అలాగే ఇటీవలే ఇక్కడ కౌంటీ మ్యాచ్​లో ఆరు వికెట్ల ప్రదర్శన చేసిన అశ్విన్​ను తుదిజట్టులోకి తీసుకోనే అవకాశం ఉందని తెలుస్తోంది. కానీ కోహ్లీ మాత్రం భిన్నంగా ఆలోచిస్తునట్లు సమాచారం. ఇషాంత్ శర్మ స్థానంలో పేస్ ఆల్​రౌండర్ శార్దూల్ ఠాకూర్​ను తీసుకోవాలని చూస్తున్నాడట. అలా అయితే అశ్విన్ రాకకు జడేజా తప్పుకోవాల్సి ఉంటుంది. మూడు వరుస సెంచరీలతో జోరుమీదున్న ఇంగ్లాండ్ కెప్టెన్​ రూట్​ను అడ్డుకోవాలంటే అశ్విన్​ ఆడాల్సి ఉంటుందని మాజీలు అభిప్రాయపడుతున్నారు.

సమతూకంతో ఇంగ్లాండ్

చివరి మ్యాచ్​లో పర్వాలేదనిపించి మంచి కమ్​బ్యాక్ ఇచ్చాడు డేవిడ్ మలన్. తన భార్య బిడ్డకు జన్మనివ్వబోతున్న కారణంగా బట్లర్ ఈ మ్యాచ్​కు దూరమయ్యాడు. దీంతో బెయిర్​స్టో వికెట్ల వెనుక బాధ్యతలు తీసుకోబోతున్నాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే మార్క్ వుడ్, క్రిస్ వోక్స్.. అండర్సన్​పై భారాన్ని తగ్గిస్తున్నారు. రాబిన్సన్​ మరోసారి రెచ్చిపోయేందుకు సిద్ధంగా ఉన్నాడు.

జట్లు

భారత్

విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, రాహుల్, పుజారా, రహానే/విహారి, పంత్, అశ్విన్/జడేజా, బుమ్రా, ఇషాంత్ శర్మ/శార్దూల్ ఠాకూర్, షమీ, సిరాజ్,

ఇంగ్లాండ్

రూట్ (కెప్టెన్), రోరీ బర్న్స్, హసీబ్ హమీద్, మలన్, బెయిర్​స్టో, మొయిన్ అలీ, సామ్ కరన్, క్రేగ్ ఓవర్టన్, ఒల్లీ రాబిన్సన్, అండర్సన్, ఒల్లీ పోప్/డాన్ లారెన్స్

ఇవీ చూడండి: 'నాలుగో టెస్టు బౌలింగ్ విభాగంలో మార్పులు చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.