ETV Bharat / sports

IND vs NZ test 2021: బలంగా కివీస్.. కుర్రాళ్లతో భారత్! - భారత్-న్యూజిలాండ్ తొలి టెస్టు లైవ్ స్కోర్

న్యూజిలాండ్​తో జరిగిన టీ20 సిరీస్​(IND vs NZ t20)ను క్లీన్​స్వీప్ చేసిన టీమ్ఇండియా.. ఇప్పుడు సుదీర్ఘ ఫార్మాట్​లో(IND vs NZ 1st Test) అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. గురువారం నుంచే ఇరు జట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది. ఉదయం 9.30 గంటలకు మ్యాచ్​ ప్రారంభం. కోహ్లీ, రోహిత్, రాహుల్, పంత్, బుమ్రా, షమీలాంటి స్టార్ ప్లేయర్లు లేకుండానే తొలి టెస్టులో బరిలో దిగుతోంది భారత్. మరోవైపు న్యూజిలాండ్ పూర్తి సన్నద్ధతతో టీ20 సిరీస్​ ఓటమిపై కసి తీర్చుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల బలాబలాలపై ఓ లుక్కేద్దాం.

IND vs NZ 1st test live, IND vs NZ 1st test preview, భారత్-న్యూజిలాండ్ తొలి టెస్టు లైవ్, భారత్-న్యూజిలాండ్ తొలి టెస్టు ప్రివ్యూ
Rahane
author img

By

Published : Nov 25, 2021, 5:31 AM IST

Updated : Nov 25, 2021, 8:02 AM IST

ప్రధాన ఓపెనింగ్ జోడీ రోహిత్, రాహుల్‌, పూర్తి స్థాయి కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకుండానే న్యూజిలాండ్‌తో తొలిటెస్టుకు(IND vs NZ 1st Test) భారత్‌కు సన్నద్ధమవుతోంది. రోహిత్‌కు విశ్రాంతినివ్వగా, రాహుల్ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. కోహ్లీ కూడా తొలి మ్యాచ్​కు విశ్రాంతి తీసుకుంటుండగా, కీపర్‌ రిషబ్ పంత్, మహమ్మద్‌ షమీ, జస్ప్రీత్ బుమ్రాలు కూడా కివీస్‌తో టెస్టు సిరీస్‌కు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వ్యక్తిగతంగా పెద్దగా ఫామ్‌లో లేని అజింక్యా రహానే కాన్పూర్ టెస్టులో భారత జట్టును నడిపించనున్నాడు. కేవలం నెలలో వ్యవధిలోనే భారత జట్టు దక్షిణాకాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో యువజట్టు కూర్పుపై కోచ్ ద్రవిడ్‌ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడోనన్న ఆసక్తి క్రీడాభిమానుల్లో నెలకొంది.

IND vs NZ Test Match Prediction: స్టార్‌ క్రికెటర్లు రోహిత్, కేఎల్ రాహుల్‌, కోహ్లీ, పంత్‌ లేకపోవడం వల్ల జట్టు రిజర్వు బలాన్ని పరీక్షించేందుకు కోచ్‌ ద్రవిడ్‌కు మంచి అవకాశం లభించినట్లే. ప్రస్తుత జట్టులో రహానే, పుజారా, మయాంక్ అగర్వాల్‌ మాత్రమే పది టెస్టులకంటే ఎక్కువ ఆడారు. మయాంక్, శుభ్‌మన్ గిల్‌ భారత ఇన్నింగ్స్‌ ఆరంభించే అవకాశముంది. వారు మంచి ప్రదర్శన చేస్తే రెగ్యులర్‌ ఓపెనర్లు జట్టులోకి వచ్చినప్పుడు అవసరమైతే వారిని మిడిల్ ఆర్డర్‌లోనైనా సర్ధుబాటు చేసే అవకాశం ఉంటుందని కోచ్ ద్రవిడ్‌ ఆశిస్తున్నాడు. గత 11 టెస్టుల్లో కేవలం 19 సగటుతో మాత్రమే పరుగులు చేసిన రహానే జట్టులో కొనసాగాలంటే కెప్టెన్‌గానే కాకుండా తనను తాను నిరూపించుకోవాల్సి ఉంది. టిమ్‌ సౌథీ, నీల్ వాగ్నర్‌ల బౌలింగ్‌ దాడిని ఎదుర్కొని నిలిస్తేనే రహానే భారీ స్కోరు సాధించే అవకాశముంది. భయం లేకుండా ఆడతానని చెబుతున్న పుజారా భుజస్కంధాలపైనే జట్టుకు భారీ స్కోరు సాధించి పెట్టే బాధ్యత పడనుంది. ఈ మ్యాచ్​తో టెస్టు అరంగేట్రం చేయబోతున్న శ్రేయుస్ అయ్యర్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఓపెనర్లుగా గిల్‌, మయాంక్, తర్వాత పుజారా, రహానే బ్యాటింగ్ ఆర్డర్‌లో వచ్చే అవకాశం ఉంది.

బౌలింగ్ విషయానికివస్తే వందకుపైగా టెస్టు మ్యాచ్‌లు ఆడి 300లకుపైగా వికెట్లు తీసిన ఇషాంత్‌ శర్మ ఇటీవల పెద్దగా రాణించలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో కివీస్‌ను లంబూ కట్టడి చేయడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సిరాజ్‌ను తుదిజట్టులోకి తీసుకోకుంటే ఇషాంత్‌ జట్టు మేనేజ్‌మెంట్‌ నమ్మకాన్ని నిలబెట్టాల్సి ఉంటుంది. కొత్త బంతితో ఉమేష్ యాదవే భారత బౌలింగ్ దాడి మొదలు పెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. జయంత్‌ యాదవ్‌తో ద్రవిడ్‌ విస్తృత కసరత్తు చేయిస్తున్న నేపథ్యంలో అక్షర్ పటేల్‌ తుది జట్టులో ఉంటాడా లేదా అనేది స్పష్టతరావాల్సి ఉంది. సీనియర్ స్పిన్నర్ అశ్విన్‌తో పాటు రవీంద్ర జడేజా కూడా మాయాజాలం ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నాడు. స్వదేశంలో ఇంగ్లాండ్‌పై చెలరేగిన అక్షర పటేల్‌ మూడో స్పిన్నర్‌గా చోటు దక్కించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

కివీస్​కు అదే బలం

న్యూజిలాండ్‌ ప్రధానబలం వారి కెప్టెన్ కేన్‌ విలయమ్సనే. టెస్టు సిరీస్‌ కోసం విలియమ్సన్‌కు కివీస్ బోర్డు విశ్రాంతి కూడా ఇచ్చింది. కీపర్, బ్యాటర్ టామ్ లాథమ్, రాస్ టేలర్, హెన్రీ నికోలస్‌లతో పటిష్టమైన బ్యాటింగ్ ఆర్డర్ కనిపిస్తోంది. ఏడో స్థానం వరకూ బ్యాటింగ్ చేయడం కివీస్‌కు అదనపు బలం. పేసర్లు టిమ్ సౌథీ, నీల్ వాగ్నర్‌లతో వారి పేస్‌ దళం బలంగా ఉంది. స్పిన్నర్లుగా అజాజ్‌ పటేల్, మిచెల్ శాంట్నర్‌లను బరిలోకి దించనుంది. మూడో స్పిన్నర్‌గా విలియం సోమర్‌విల్లే లేదా ఇష్ సోధి కివీస్‌కు అందుబాటులో ఉన్నారు. గురువారం ఉదయం తొమ్మిదన్నరకు భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య తొలి టెస్టు మొదలు కానుంది.

ఇవీ చూడండి: 'ఈ జెర్సీ ధరిస్తే ప్రపంచకప్ మనదే'.. జాఫర్ ఫన్నీ మీమ్

Last Updated : Nov 25, 2021, 8:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.