ETV Bharat / sports

రంజీలోమరో గోల్డెన్‌ డక్‌ - రహానె ఫ్యాన్స్​ టెన్షన్​! - అజింక్య రహానె రంజీ ట్రోఫీ 2024

Ajinkya Rahane Ranji Trophy 2024 : రంజీలో సత్తా చాటి టీమ్​ఇండియాలోకి రీ ఎంట్రీ ఇద్దామనుకుంటున్న టీమ్​ఇండియా స్టార్​ క్రికెటర్ అజింక్య రహానెకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా జరిగిన మ్యాచ్​లో అతడు గోల్డెన్​ డకౌట్​గా వెనుతిరిగాడు. దీంతో అతడి ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు.

Ajinkya Rahane Ranji Trophy 2024
Ajinkya Rahane Ranji Trophy 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 19, 2024, 5:51 PM IST

Ajinkya Rahane Ranji Trophy 2024 : టీమ్ఇండియా సీనియర్‌ బ్యాటర్‌ అజింక్య రహానె ప్రస్తుతం తన ఫామ్​ను తిరిగి తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. 2020-21 సీజన్‌లో ఆస్ట్రేలియాలో జరిగిన భారత్‌ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఈ స్టార్ క్రికెటర్​, చాలా మ్యాచ్‌ల్లో కీలక ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియాను ఆదుకున్నాడు. అయితే ప్రస్తుతం కొత్త కుర్రాళ్ల రాకతో టెస్టు జట్టు రేసులో బాగా వెనకబడిపోయాడు. 2023లో చివరిగా రెండు టెస్టుల సిరీస్ కోసం వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లాడు. అయితే ఆ సిరీస్‌లో విఫలమవడం వల్ల అప్పటి నుంచి అతడ్ని పక్కన పెట్టారు. త్వరలో ఇంగ్లాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కూ అతడ్ని ఎంపిక చేయలేదు. దీంతో రహానె ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ఆడుతున్నాడు. ముంబయి జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తిరిగి భారత జట్టులో స్థానాన్ని సంపాదించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అయితే తన లక్ష్య చేధనలో వరుసగా విఫలమవుతున్నాడు. దీంతో అతడి ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Ajinkya Rahane Golden Duck : తాజాగా గ్రూప్‌-బిలో భాగంగా కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ సీజన్‌లో ఇలా వరుసగా రెండోసారి ఔటైన రహానె తమ పేలవ ఫామ్​తో విమర్శలను ఎదుర్కొంటున్నాడు. బాసిల్‌ థంపీ బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. దీంతో ఇక టీమ్​ఇండియాలో రహానె రీఎంట్రీ కష్టమే అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫిట్‌నెస్‌లేమి కారణంగా తొలి రంజీ మ్యాచ్‌కు దూరమైన రహానె, రెండో మ్యాచ్‌లోనూ రాణించలేకపోయాడు.

అయితే గతేడాది రంజీల్లో ముంబయి సారథిగా అద్భుతంగా రాణించి జట్టును ఆదుకున్నాడు రహానె. అంతే కాకుండా ఐపీఎల్‌-2023లోనూ మంచి ఫామ్​తో చెలరేగిపోయాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు తరఫున ఆడి సత్తా చాటాడు. కష్ట సమయాల్లో మైదానంలోకి దిగి జట్టుకు సహాయ సహకారాలు అందించాడు. అలా సంప్రదాయ క్రికెట్‌లోనే కాకుండా పొట్టి ఫార్మాట్లోనూ కీలక ఇన్నింగ్స్​ ఆడి టీమ్ఇండియాకు మంచి స్కోర్​ అందించాడు.

ఐపీఎల్​లో సారధిగా నో ఛాన్స్​.. టీమ్ఇండియాకి కెప్టెన్​గా ఆ ముగ్గురు..

రోహిత్​ టు రహానే.. విండీస్​ టెస్ట్​లో టాప్​-5 కీలక ప్లేయర్స్​ వీరే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.