ETV Bharat / sports

సత్తా చాటిన పంత్, గిల్​.. ఇషాంత్​కు 3 వికెట్లు - డబ్ల్యూటీసీ ఫైనల్

సౌథాంప్టన్ వేదికగా భారత ఆటగాళ్లు ప్రాక్టీస్​ మ్యాచ్​లో సత్తా చాటారు. ఇంట్రా స్క్వాడ్​ మ్యాచ్​లో శుభ్​మన్​ గిల్, రిషభ్ పంత్, ఇషాంత్ శర్మ రాణించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ ట్విట్టర్​లో షేర్​ చేసింది.

ishanth sharma, rishabh pant, intra squad match
ఇషాంత్ శర్మ, రిషభ్ పంత్, ఇంట్రా స్క్వాడ్​ మ్యాచ్​
author img

By

Published : Jun 12, 2021, 9:08 PM IST

ఇంట్రా స్క్వాడ్​ ప్రాక్టీస్ మ్యాచ్​లో భాగంగా టీమ్ఇండియా ఆటగాళ్లు అదరగొడుతున్నారు. యువ ఓపెనర్​ శుభ్​మన్​ నిలకడైన ఆటతీరును కనపరిచాడు. 85 పరుగులతో సత్తా చాటాడు. మరో యువ కెరటం రిషభ్ పంత్ కేవలం 94 బంతుల్లోనే 121 పరుగులతో అజేయంగా నిలిచాడు. సీనియర్​ పేసర్​ ఇషాంత్ శర్మ మూడు వికెట్లతో రాణించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్​ ఖాతాలో షేర్​ చేసింది.

"ఇంట్రా స్క్వాడ్​ ప్రాక్టీస్​ మ్యాచ్​లో ఇది రెండో రోజు. యువ ఆటగాడు శుభ్​మన్​ గిల్.. 135 బంతుల్లో 85 రన్స్​ చేశాడు. మరో ప్లేయర్​ రిషభ్ పంత్ 94 బాల్స్​లో 121* పరుగులు సాధించాడు. వెటరన్ పేసర్​ ఇషాంత్​ 36 పరుగులకే 3 వికెట్లు తీశాడు" అని బీసీసీఐ ట్వీట్ చేసింది.

ఇదీ చదవండి: కరోనా విరాళాల కోసం చాహల్​తో ఆనంద్​​ చెస్​ పోరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.