'సాండర్ గేట్' వివాదం గురించి ఆసీస్ క్రికెటర్ బాన్‌క్రాఫ్ట్ చేసిన వ్యాఖ్యలపై క్రికెట్ ఆస్ట్రేలియా స్పందించింది. ఇంకా ఈ వ్యవహారంలో ఎవరికైనా సమాచారం తెలిసి ఉంటే స్వయంగా ముందుకు రావాలని ప్రకటించింది. ఈ అంశానికి సంబంధించి దర్యాప్తు గతంలోనే సమగ్రంగా జరిగిందని తెలిపింది. అవసరమైతే మరోసారి దర్యాప్తు చేయడానికి తాము సిద్ధమని పేర్కొంది.
"2018లో ఆస్ట్రేలియా- దక్షిణాఫ్రికా మధ్య జరిగిన కేప్‌టౌన్ టెస్టులో.. బాల్ ట్యాంపరింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇందులో ఎవరి వద్ద అయినా కొత్త సమాచారం ఉంటే వెల్లడించాలి. ఇందుకు సంబంధించిన దర్యాప్తు గతంలోనే జరిగింది. అప్పటి నుంచి దీని గురించి ఎవరూ చర్చించలేదు" అని క్రికెట్ ఆస్ట్రేలియాకు చెందిన ప్రతినిధి తెలిపారు.
బాల్ ట్యాంపరింగ్ విషయంపై ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశాడు ఆసీస్ క్రికెటర్ బాన్‌క్రాఫ్ట్. స్టీవ్ స్మిత్, వార్నర్‌తో పాటు బౌలర్లందరికీ ట్యాంపరింగ్ గురించి ముందే తెలుసని అన్నాడు.
ఇదీ చదవండి: 'బాల్ ట్యాంపరింగ్ గురించి వాళ్లకు ముందే తెలుసు'