ETV Bharat / sports

మెగాటోర్నీలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్​గా అఫ్గాన్​​-సెమీస్ చేరేందుకు ఇంకా ఛాన్స్​!

Afghanistan Semi Final Chances : మెగాటోర్నీలో అంచనాలు లేకుండా ఎంట్రీ ఇచ్చిన అఫ్గానిస్థాన్.. ప్రస్తుతం సంచలన విజయాలకు కేరాఫ్ అడ్రస్​గా మారింది. ఇప్పటికే ఇంగ్లాండ్, పాకిస్థాన్, శ్రీలంకపై నెగ్గిన ఈ జట్టు తాజాగా నెదర్లాండ్స్​పై కూడా గెలుపొందింది. ఈ విజయంతో సెంమీస్ అవకాశాలను అఫ్గాన్​ సజీవంగా ఉంచుకుంది.

Afghanistan Semi Final Chances
Afghanistan Semi Final Chances
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 3, 2023, 10:56 PM IST

Afghanistan Semi Final Chances : 2023 వరల్డ్​కప్​ టోర్నీలోకి అంచనాలు లేకుండా అడుగుపెట్టింది అఫ్గానిస్థాన్. అంతా అనుకున్నట్లుగానే తొలి రెండు మ్యాచ్​ల్లో వారి ప్రదర్శన కూడా అలాగే సాగింది. కానీ, ఆ తర్వాతే షురూ అయ్యింది అఫ్గాన్ అసలు కథ. ఈ మెగాటోర్నీలో మూడో మ్యాచ్​లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్​ను ఎదుర్కొన్న అఫ్గాన్.. సంచలన విజయం నమోదు చేసి యావత్ క్రికెట్ ప్రపంచం చూపు తమవైపు తిప్పుకుంది.​ ఈ మ్యాచ్​లో ఆల్​రౌండ్ ప్రదర్శన కనబరుస్తూ.. ఇంగ్లాండ్​పై పూర్తి ఆధిపత్యం చెలాయించిన అఫ్గాన్.. 69 పరుగుల తేడాతో నెగ్గింది.

హ్యాట్రిక్ విజయాలు.. ఇంగ్లాండ్​తో మ్యాచ్ తర్వాత అఫ్గాన్.. న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్​లో అఫ్గాన్, బ్యాటింగ్​లో విఫలమైనప్పటికీ.. భీకరమైన ప్రత్యర్థిని 288 పరుగులకు కట్టడి చేసి బౌలింగ్​లో ఫర్వాలేదనిపించింది. ఈ మ్యాచ్​ తర్వాత ఆఫ్గానిస్థాన్ ఆడిన మూడింట్లోనూ విజయాలు నమోదు చేసి సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది.

తాజా విజయంతో 8 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకిన అఫ్గాన్.. మెరుగైన స్థితిలో కనిపిస్తోంది. మరోవైపు న్యూజిలాండ్​ కూడా ఏడు మ్యాచ్​ల్లో 4 గెలిచి 8 పాయింట్లు సంపాదించింది. కానీ, మెరుగైన రన్​రేట్​ కారణంగా అఫ్గాన్​ కంటే న్యూజిలాండ్ ముందుంది. ఇక టోర్నీలో అఫ్గానిస్థాన్​ మరో రెండు మ్యాచ్​లు ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్​ల్లో వారు బలమైన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాను ఎదుర్కొవాల్సి ఉంది. అయితే అఫ్గాన్ సెమీస్ చేరాలంటే రెండింట్లోనూ నెగ్గాలి. అటు న్యూజిలాండ్ కనీసం ఒక మ్యాచ్​లో ఓడాలి. కానీ, ఒకవేళ అదృష్టం కలిసొచ్చి అఫ్గాన్ సెమీస్​లో అడుగుపెడితే ప్రపంచకప్​ చరిత్రలోనే అది సంచలనమౌతుంది.

ఆ మ్యాచ్​లో అఫ్గాన్ నమోదు చేసిన రికార్డులు..

  • వరల్డ్​కప్ హిస్టరీలో అఫ్గాన్ ఇప్పటివరకు 22 మ్యాచ్​లు ఆడింది. అయితే అందులో తొలి 17 మ్యాచ్​ల్లో ఒకే ఒక్క విజయం నమోదు చేస్తే.. చివరి 5 మ్యాచ్​ల్లోనే 4సార్లు నెగ్గింది.
  • ప్రస్తుత ప్రపంచకప్​లో అఫ్గాన్.. మూడుసార్లు సక్సెస్​ఫుల్​గా టార్గెట్ ఛేదించింది. ఈ లిస్ట్​లో భారత్ (5సార్లు) ముందుంది.
  • ​మెగాటోర్నీలో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు నమోదు చేసిన అఫ్గాన్ బ్యాటర్​గా రహ్మత్ షా నిలిచాడు.
    • AFGHANISTAN HAVE REPLACED PAKISTAN AT NO.5 IN POINTS TABLE...!!!!

      4th victory in this World Cup for Afghanistan, they're a super team. pic.twitter.com/tyVCz5Canf

      — Mufaddal Vohra (@mufaddal_vohra) November 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
    • 2023 World Cup Semi Finals chances:

      India - QUALIFIED.
      South Africa - 99.9%.
      Australia - 74%.

      New Zealand - 56%.
      Afghanistan - 52%.

      Pakistan - 17%.
      Sri Lanka - 0.6%.
      England - 0.4%.
      Netherlands - 0.1%.
      Bangladesh - ELIMINATED.

    • Afghanistan in World Cup history:

      First 17 matches - 1 win.
      Next 5 matches - 4 wins.

      - This is commendable stuff from Afghan Atalan...!!! 👏 pic.twitter.com/RoJYvByVnG

Ibrahim Zadran Afghanistan : పాక్​ వెళ్లగొట్టిన ప్రజలకు అవార్డు అంకితమిచ్చిన అఫ్గాన్​ ప్లేయర్​.. ఎందుకో తెలుసా?

ODI World Cup 2023 Afghanistan Records : పాకిస్థాన్​పై అద్భుత విజయం.. అఫ్గాన్ నమోదు చేసిన​ 8 రికార్డులివే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.