మహిళలు క్రికెట్ ఆడేందుకు (afghanistan women cricket) ఇప్పటికీ అవకాశం ఉందని అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ అజీజుల్లా ఫజ్లీ అన్నారు. ఈ ప్రక్రియ ఎలా జరగబోతుందో త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు. తమ దేశం తరఫున మహిళలు క్రికెట్ ఆడాల్సిన పనిలేదని తాలిబన్ నేత అహ్మదుల్లా వసీక్ ప్రకటించిన కొద్దిరోజులకే ఫజ్లీ ఈ మేరకు వ్యాఖ్యానించారు.
"మహిళలు క్రికెట్ ఆడేందుకు ఇంకా అవకాశం ఉంది. దీనిపై ఏ విధంగా ముందుకు వెళ్తామో త్వరలోనే స్పష్టమైన వివరాలు వెల్లడిస్తాం. ఈ ప్రక్రియపై ఓ శుభవార్త బయటకు రానుంది."
- అజీజుల్లా ఫజ్లీ, అఫ్గాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్
మహిళలు క్రికెట్ ఆడేందుకు తాలిబన్లు విముఖత చూపితే పురుషుల జట్టుతో నవంబర్‌లో జరగాల్సిన టెస్టు మ్యాచ్ రద్దు చేస్తామని ఇదివరకే ఆస్ట్రేలియా హెచ్చరించింది. ఆసీస్ టెస్టు కెప్టెన్ టిమ్ పైన్ కూడా టీ20 ప్రపంచకప్ నుంచి అఫ్గాన్‌ను తప్పించాలని పేర్కొన్నాడు. అయితే తాలిబన్ల ప్రకటన ఆధారంగా పురుషుల జట్టును శిక్షించవద్దని ఆస్ట్రేలియాను కోరింది అఫ్గాన్ క్రికెట్ బోర్డు.
ఇదీ చూడండి: T20 Worldcup: 'ప్రపంచకప్‌లో అఫ్గాన్ ఆడటం కుదరదు'