కరోనా కారణంగా ఐపీఎల్ నిరవధిక వాయిదా పడింది. దీంతో విదేశీ ఆటగాళ్లు వారి స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఆ అదృష్టం లేకుండా పోయింది. అక్కడి ప్రభుత్వం భారత్ నుంచి వచ్చే విమానాలను మే 15 వరకు రద్దు చేయడమే ఇందుకు కారణం.
ఈ నేపథ్యంలో తమ ఆటగాళ్లను ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టాడ్ గ్రీన్బెర్గ్ హెచ్చరించారు. ఇకపై విదేశీ లీగుల్లో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకునేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
ప్రస్తుతం ఆస్ట్రేలియా ఆటగాళ్లను తమ స్వదేశానికి సురక్షితంగా పంపించడానికి బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. ప్రత్యేక విమానాల ద్వారా మాల్దీవులు మీదుగా వారిని స్వదేశానికి పంపే ఏర్పాట్లు చేస్తోంది.
ఇదీ చూడండి: ఆస్ట్రేలియా ఆటగాళ్ల కోసం ప్రత్యేక విమానాలు