ETV Bharat / sports

Abu Dhabi T10 League: మొయిన్ ఊచకోత.. లీగ్​లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ - మొయిన్ అలీ వేగవంతమైన హాఫ్ సెంచరీ

Abu Dhabi T10 League: అబుదాది టీ20 లీగ్​లో అత్యంత వేగంగా అర్ధశతకం చేసిన క్రికెటర్​గా రికార్డు సృష్టించాడు ఇంగ్లాండ్ బ్యాటర్ మొయిన్ అలీ. నార్తర్న్ వారియర్స్​కు ఆడుతున్న ఇతడు టీమ్ అబుదాబితో జరిగిన మ్యాచ్​లో ఈ ఘనత సాధించాడు.

Moeen Ali Fastest Fifty, Moeen Ali Abu Dhabi T10 League, మొయిన్ అలీ హఫ్ సెంచరీ, మొయిన్ అలీ అబుదాబి టీ20 లీగ్
Moeen Ali
author img

By

Published : Nov 28, 2021, 11:26 AM IST

Moeen Ali smashes Fastest Fifty: ఇంగ్లాండ్ క్రికెటర్ మొయిన్ అలీ అబుదాబి టీ10 లీగ్​(Abu Dhabi T10 League)లో దుమ్మురేపాడు. ఈ లీగ్​లో నార్తర్న్ వారియర్స్​కు ఆడుతున్న ఇతడు టీమ్ అబుదాబితో జరిగిన మ్యాచ్​లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 16 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకుని.. ఈ టోర్నీలో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన క్రికెటర్​గా రికార్డులకెక్కాడు. మొత్తంగా ఈ మ్యాచ్​లో 23 బంతుల్లోనే 77 పరుగులు చేసి జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు అలీ. ఇతడికి మద్దతుగా నిలిచిన మరో ఓపెనర్ కెన్నెర్ లూయిస్ 32 బంతుల్లో 65 పరుగులతో మెరిశాడు. దీంతో వీరిద్దరూ ఓపెనింగ్ వికెట్​కు 146 పరుగులు జోడించారు. ఫలితంగా ఈ మ్యాచ్​లో టీమ్ అబుదాబిపై నార్తర్న్ వారియర్స్ ఘనవిజయం సాధించింది.

ఈ మ్యాచ్​లో రికార్డులు ఇవే

  • ఈ టోర్నీలో అత్యధిక వేగంగా అర్ధసెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు మొయిన్ అలీ. (16 బంతుల్లో)
  • లీగ్​లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ (77) సాధించిన క్రికెటర్​గానూ ఘనత వహించాడు అలీ.
  • అలాగే కెన్నెర్​తో కలిసి అత్యధిక భాగస్వామ్య పరుగుల రికార్డు నెలకొల్పాడీ ఇంగ్లీష్ క్రికెటర్
  • వీరిద్దరి విజృంభణతో ఓ ఇన్నింగ్స్​లో అత్యధిక సిక్సులు బాదిన జట్టుగా ఘనత సాధించింది నార్తర్న్ వారియర్స్.

ఇవీ చూడండి: ఆటతో అదరగొడతాం.. అందంతో మది దోచేస్తాం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.