ETV Bharat / sports

AB de villiers vs Kohli : 'కోహ్లీ-సూర్యతో తలపడాలని ఉంది'

ab de villiers vs kohli : సౌత్​ఆఫ్రికా మాజీ స్టార్​ బ్యాటర్ డివిలియర్స్ మరోసారి ​ టీమ్ఇండియా స్టార్ బ్యాటర్​ కోహ్లీ గురించి మాట్లాడాడు. అలాగే సూర్యకుమార్​తో యాదవ్​తో తలపడాలని కూడా ఉందని చెప్పుకొచ్చాడు.

author img

By

Published : Jul 5, 2023, 10:58 AM IST

Updated : Jul 5, 2023, 11:10 AM IST

De Villers Jio Cinema Interview
డివిలియర్స్​ ఇంటర్వ్యూ

ab de villiers vs kohli : టీమ్ఇండియా స్టార్​ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్​ యాదవ్​లతో పోటీపడాలనుందని సౌత్ఆఫ్రికా మాజీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ అసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్​లో విరాట్​తో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తానన్నాడు. అతడు తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఈ విషయలు పంచుకున్నాడు.

కాగా డివిలియర్స్, కింగ్ కోహ్లీతో కలిసి ఐపీఎల్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ప్రాతినిధ్యం వహించాడు. వీరిద్దరూ కలిసి మైదానంలో అనేక సార్లు పరుగుల పారించి.. ఆర్సీబీ జట్టుకు ఎన్నో అసాధారణ విజయాలు అందించారు. గతంలో కూడా డివిలియర్స్.. కోహ్లీపై పలుమార్లు ప్రశంసల జల్లు కురిపించాడు. ఐపీఎల్​లో సుదీర్ఘ కాలం అతడు ఆర్సీబీకి జట్టుకే ఆడాడు. ఇక ప్రస్తుతం క్రికెట్​లో సూర్యకుమార్ యాదవ్.. తన 360 డిగ్రీల ఆటతీరుతో డివిలియర్స్​ను తలపిస్తున్నాడు.

"నాకు ఇప్పటికీ క్రికెట్ ఆడాలని ఉంది. కాని ఇప్పుడు ఆ అవకాశం లేదు. నా కెరీర్​ను నేను అత్యుత్తమంగా ​ముగించలేదు. ఏడాదికి రెండు, మూడు నెలలు క్రికెట్ ఆడాలనుకోలేదు. ఎందుకంటే నేను ప్రపంచంలో గొప్ప బ్యాటర్​గా ఉండాలనుకున్నా. కానీ సంవత్సరానికి మూడు నెలలు ఆడితే.. అది సాధ్యం కాదు. ఒకవేళ నేను మళ్లీ పిచ్​లో అడుగుపెడితే.. విరాట్, సూర్యలతో పోటీపడాలని ఉంది"

- డివిలియర్స్, సౌత్​ఆఫ్రికా మాజీ బ్యాటర్.

డివిలియర్స్ తన 15 ఏళ్ల క్రికెట్​ కెరీర్​లో.. ప్రతిష్ఠాత్మకమైన ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్​ ది ఇయర్ అవార్డును మూడు సార్లు గెలుచుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ (15 బంతుల్లో ), సెంచరీ ( 31 బంతుల్లో ), 150 ( 64 బంతుల్లో ) పరుగులు తన పేరిటే ఉన్నాయి. మొత్తంగా డివిలియర్స్ తన కెరీర్​లో వన్డేల్లో 9577 పరుగులు ( 25 శతకాలు ), టెస్టుల్లో 8765 పరుగులు (22 శతకాలు ) సాధించాడు. డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్​లో అన్ని ఫార్మాట్ల​కు 2021లోనే రిటైర్మెంట్ ప్రకటించాడు. కాగా తన అసాధారణ ఆటతీరుతో డివిలియర్స్​ భారత్​లో కూడా ఎందరో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

ఆ బౌలర్లు ఇబ్బంది పెట్టేవారు..
గ్రౌండ్​కు అన్ని వైపులా తనదైన శైలిలో షాట్లు ఆడగల డివిలియర్స్​.. తనను ఎక్కువగా ఇబ్బంది పెట్టిన బౌలర్ల గురించి కూడా ఇంటర్వ్యూలో ప్రస్తావించాడు. టీమ్ఇండియా యార్కర్​ కింగ్ బుమ్రా, అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్, ఆసీస్ మాజీ ఆటగాడు షేన్ వార్న్​ల బౌలింగ్​లో అతడు ఇబ్బంది పడేవాడని తెలిపాడు.

Last Updated : Jul 5, 2023, 11:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.