AB De Villiers Eye Surgery : సౌతాఫ్రికా దిగ్గజ ప్లేయర్, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ తన రిటైర్మెట్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు. అయితే 2018లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన డివిలియర్స్, 2021 వరకూ ఆయా డొమెస్టిక్ లీగ్‌ల్లో ఆడాడు. ముఖ్యంగా ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున డివిలియర్స్, జట్టుకు అనేక విజయాలు అందించాడు.
రీసెంట్గా 'విస్డెన్ క్రికెట్ 'అనే మ్యాగజెన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న డివిలియర్స్, షాకింగ్ విషయాలు బయటపెట్టాడు. అతడు రిటైర్మెంట్ ప్రకటించక ముందు కంటిచూపు సమస్యతో బాధపడినట్లు తెలిపాడు. తన కెరీర్లో చివరి రెండేళ్లు రెటినా లేని (డిటాచ్ రెటీనా) కంటితోనే క్రికెట్ ఆడినట్లు చెప్పాడు. "మా కుమారుడు తన మోకాలితో పొరపాటున నా కుడి కన్నుపై తన్నాడు. అప్పటి నుంచి నా కంటి చూపు మందగించింది. అయితే సర్జరీ అనంతరం 'నువ్వు క్రికెట్ ఎలా ఆడావు?' అని డాక్టర్లు అడిగారు. అయితే నా ఎడమ కన్ను స్పష్టంగా కనిపించడం వల్ల క్రికెట్ ఆడడం సాధ్యమైంది" అని డివిలియర్స్ అన్నాడు.
-
AB de Villiers reveals he played the last two years of his career with a detached retina.#abdevilliers17 #abdevilliers #southafricacricket #Proteas #SKY247 pic.twitter.com/4tiY7blp6X
— Sky247 (@officialsky247) December 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">AB de Villiers reveals he played the last two years of his career with a detached retina.#abdevilliers17 #abdevilliers #southafricacricket #Proteas #SKY247 pic.twitter.com/4tiY7blp6X
— Sky247 (@officialsky247) December 7, 2023AB de Villiers reveals he played the last two years of his career with a detached retina.#abdevilliers17 #abdevilliers #southafricacricket #Proteas #SKY247 pic.twitter.com/4tiY7blp6X
— Sky247 (@officialsky247) December 7, 2023
AB De Villiers IPL Stats : అయితే చివరి రెండేళ్ల కెరీర్లో డివిలియర్స్ కంటి సమస్యతోనే 2020, 2021 ఎడిషన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆడాడు అన్నమాట. ఈ రెండు ఎడిషన్లలో వరుసగా 454, 313 పరుగులతో రాణించాడు. చివరి రెండు ఎడిషన్ ఐపీఎల్లో డివిలియర్స్ ఏకంగా 7 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఇక ఓవరాల్‌గా ఐపీఎల్లో 184 మ్యాచ్‌లు ఆడిన డివిలియర్స్, 5,162 పరుగులు చేశాడు. అందులో 3 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
AB De Villiers International Stats : అంతర్జాతీయ క్రికెట్లో ఏబీ డివిలియర్స్ 114 టెస్టులు, 228 వన్డే, 75 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 8765 పరుగులు (22 సెంచరీలు), వన్డేల్లో 9577 పరుగులు (25 సెంచరీలు), టీ20ల్లో 135.17 స్ట్రైక్ రేట్‌తో 1672 పరుగులు బాదాడు.
-
Ab De Villiers 90(39) vs DD 2018 extended highlights. That was some clean hitting.. Just unreal 🫡🫡 pic.twitter.com/sy7X4ndok6
— Shreyy (@Sadly_shrey) December 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Ab De Villiers 90(39) vs DD 2018 extended highlights. That was some clean hitting.. Just unreal 🫡🫡 pic.twitter.com/sy7X4ndok6
— Shreyy (@Sadly_shrey) December 6, 2023Ab De Villiers 90(39) vs DD 2018 extended highlights. That was some clean hitting.. Just unreal 🫡🫡 pic.twitter.com/sy7X4ndok6
— Shreyy (@Sadly_shrey) December 6, 2023