2025 Champions Trophy Qualified Teams : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిర్వహించే టోర్నీల్లో ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఒకటి. ఈ టోర్నీని కూడా వన్డే ప్రపంచకప్‌లా ప్రతి నాలుగేళ్లకొకసారి జరుగుతుంది. ఈ టోర్నీలో 8 జట్లు తలపడుతాయి. ఈ క్రమంలో 2025 ఫిబ్రవరి - మార్చిలో తొమ్మిదో ఎడిషన్ టోర్నమెంట్ జరగనుంది. ప్రస్తుత ప్రపంచకప్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచిన పాకిస్థాన్.. రీసెంట్గా 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించింది. మరి ఇప్పటికే ఈ టోర్నీకి అర్హత సాధించిన జట్లు ఏవో చూద్దాం.
భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో తలపడనున్నాయి. అయితే అఫ్గానిస్థాన్ తొలిసారి ఈ టోర్నీలో పాల్గొననుంది. ఇక శ్రీలంక మొదటిసారి ఈ టోర్నీకి అర్హత సాధించలేదు. ఈ ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించి.. మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఈ లీగ్ మ్యాచ్‌లో రెండు గ్రూపుల్లో టాప్ 2 జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి.
అయితే 1998లో తొలిసారి ప్రారంభమైన ఈ టోర్నీ అప్పట్లో ప్రతి రెండేళ్లకొకసారి జరిగింది. ఈ క్రమంలో 1998, 2002, 2004, 2006, 2009 నిర్వహించారు. తర్వాత టోర్నీ నిర్వహణ నాలుగేళ్లుగా ఐసీసీ నిర్ణయించింది. అప్పటినుంచి 2013, 2017లో టోర్నమెంట్ జరిగింది. అయితే ఆ తర్వాత 2021లో టోర్నీ జరగాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల ఆ ఏడాది రద్దైంది. దీంతో 2025 నుంచి యథావిధిగా జరగనుంది. కాగా, ఈ ఎడిషన్‌కు పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనుంది.
-
Here are the eight teams that secured a spot in the Champions Trophy 2025. pic.twitter.com/rf1JY99o9q
— CricTracker (@Cricketracker) November 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Here are the eight teams that secured a spot in the Champions Trophy 2025. pic.twitter.com/rf1JY99o9q
— CricTracker (@Cricketracker) November 13, 2023Here are the eight teams that secured a spot in the Champions Trophy 2025. pic.twitter.com/rf1JY99o9q
— CricTracker (@Cricketracker) November 13, 2023
ఎవరెవరు ఎన్నిసార్లు విజేతలు.. భారత్ (2002, 2013), ఆస్ట్రేలియా (2006, 2009) అన్ని జట్ల కంటే అత్యధికంగా రెండుసార్లు నెగ్గాయి. అయితే భారత్ 2002లో శ్రీలంకతో పాటు సంయుక్తంగా ఛాంపియన్‌గా నిలిచింది. ఇక సౌతాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండిస్, పాకిస్థాన్ ఒక్కోసారి గెలిచాయి.
చివరిసారి విజేత ఎవరు.. 2017లో చివరిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది. ఈ ఎడిషన్‌లో ఫైనల్లో భారత్.. పాకిస్థాన్‌ను ఢీకొట్టింది. కానీ పాక్ నిర్దేశించిన 339 పరుగుల లక్ష్య ఛేదనలో టీమ్ఇండియా 158 పరుగుల వద్ద ఆలౌటై.. రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
ఎలా అర్హత సాధించాలి? ఆతిథ్యమిచ్చే జట్టు ఈ టోర్నీ ఆటోమెటిక్‌గా అర్హత సాధిస్తుంది. ఇక ఈ టోర్నీకి ముందు జరిగే వన్డే వరల్డ్‌కప్‌లో టాప్ 7 జట్లు పాల్గొంటాయి.
-
SRI LANKA IS OUT OF THE CHAMPIONS TROPHY 2025. pic.twitter.com/8XkDmDhsAV
— Johns. (@CricCrazyJohns) November 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">SRI LANKA IS OUT OF THE CHAMPIONS TROPHY 2025. pic.twitter.com/8XkDmDhsAV
— Johns. (@CricCrazyJohns) November 11, 2023SRI LANKA IS OUT OF THE CHAMPIONS TROPHY 2025. pic.twitter.com/8XkDmDhsAV
— Johns. (@CricCrazyJohns) November 11, 2023
'భారత్ బ్యాటింగ్ లైనప్, అనేక తలలున్న రాక్షసుడు- ఓడిపోయినా తల ఎత్తుకునే వెళ్తున్నాం!'
' కెప్టెన్‌గా ఎఫర్ట్ పెడుతాను - వాళ్లు అలా చేయకపోతే ఏ జట్టుకైనా గెలవడం కష్టమే'