2023 World Cup Knockout Tickets : భారత క్రికెట్ బోర్డు ( బీసీసీఐ) క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. 2023 వరల్డ్‌కప్ నాకౌట్ మ్యాచ్‌ల టికెట్లను.. మరికొన్ని గంటల్లో అమ్మనున్నట్లు అధికారికంగా పేర్కొంది. ఈ క్రమంలో రెండు సెమీస్, ఫైనల్‌తో కలిపి మూడు మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లు నవంబర్ 9 గురువారం రాత్రి 8.00 గంటల నుంచి (https://tickets.cricketworldcup.com.) వెబ్సైట్లో అందుబాటులో ఉండనున్నాయి.
-
🚨 NEWS 🚨
— BCCI (@BCCI) November 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Final set of tickets for ICC Men’s World Cup 2023 knockouts to go live today 🎫
Details 🔽 #CWC23 https://t.co/xsr5GWWPMm
">🚨 NEWS 🚨
— BCCI (@BCCI) November 9, 2023
Final set of tickets for ICC Men’s World Cup 2023 knockouts to go live today 🎫
Details 🔽 #CWC23 https://t.co/xsr5GWWPMm🚨 NEWS 🚨
— BCCI (@BCCI) November 9, 2023
Final set of tickets for ICC Men’s World Cup 2023 knockouts to go live today 🎫
Details 🔽 #CWC23 https://t.co/xsr5GWWPMm
1st సెమీఫైనల్.. మెగాటోర్నీలో నాలుగు జట్ల మధ్య రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. సెమీస్‌లో గెలిచిన జట్లు ఫైనల్స్‌కు చేరుకుంటాయి. ఈ క్రమంలో పాయింట్ల పట్టికలో తొలి, నాలుగో స్థానంలో ఉన్న రెండు జట్లు సెమీ ఫైనల్ 1లో తలపడతాయి. ఈ మ్యాచ్ నవంబర్ 15న ముంబయి వాంఖడే వేదికగా జరగనుంది.
2nd సెమీఫైనల్.. పాయింట్ల పట్టికలో రెండు, మూడు ప్లేస్‌లో ఉన్న జట్లు సెమీఫైనల్ 2 ఆడనున్నాయి. ఈ మ్యాచ్.. నవంబర్ 16న జరగనుంది. ఈ సమరానికి కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికకానుంది.
ఫైనల్.. రెండు సెమీస్‌లో గెలిచిన జట్లు.. నవంబర్ 19 ఆదివారం రోజున మెగాఫైనల్లో తలపడనున్నాయి. అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
మెగాటోర్నీలో సెమీస్ చేరిన జట్లు.. ప్రస్తుత టోర్నమెంట్లో భారత్ (16 పాయింట్లు), సౌతాఫ్రికా (12 పాయింట్లు), ఆస్ట్రేలియా (10 పాయింట్లు) జట్లు ఇప్పటికే సెమీస్ చేరాయి. ఇక మిగిలిన ఒక స్థానం కోసం న్యూజిలాండ్ (8 పాయింట్లు), పాకిస్థాన్ (పాయింట్లు), అఫ్గానిస్థాన్ (పాయింట్లు) మధ్య తీవ్ర పోటి నెలకొంది. ఈ మూడు జట్లు టోర్నీలో ఇంకొక్క మ్యాచ్ ఆడాల్సి ఉంది.
రన్‌రేట్ కీలకం.. అయితే నాలుగో సెమీస్ బెర్త్ కోసం న్యూజిలాండ్ ,అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ జట్లు పోటీ పడుతున్నాయి. ఈ మూడు జట్లు కూడా పాయింట్ల పరంగా సమానంగా ఉన్నా.. రన్‌రేట్ కారణంగా కివీస్ మెరుగైన పొజిషన్లో ఉంది. న్యూజిలాండ్ తమ ఆఖరి మ్యాచ్‌లో గెలిస్తే.. అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ జట్లు తమ చివరి మ్యాచ్‌లో భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ రెండు జట్లు ఓటమితో టోర్నీని ముగిస్తే.. కివీస్ సెమీస్‌కు దూసుకెళ్తుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
శ్రీలంకతో కీలక పోరు - మ్యాచ్‌కు వర్షం ముప్పు - న్యూజిలాండ్ నిలిచేనా?
2 బెర్త్‌లు 4 జట్లు- ఉత్కంఠగా వరల్డ్‌కప్ సెమీస్ రేస్, భారత్‌తో తలపడేదెవరు?