ETV Bharat / sports

రెండు జట్లతో టీమ్ఇండియా ప్రయోగం.. కొత్తేం కాదు! - india vs srilanka

ఒకేసారి రెండు వేర్వేరు సిరీస్​ల కోసం వేర్వేరు జట్లను పంపించడం టీమ్​ఇండియాకు కొత్తేం కాదు. త్వరలో శ్రీలంక, ఇంగ్లాండ్​కు పర్యటనకు ఇలాగే రెండు జట్లు వెళ్లనున్నాయి. అయితే 1998లో ఇలాంటి ప్రయోగం చేసి విఫలమైన భారత్.. ఈసారి ఏం చేస్తుందో చూడాలి.

When India fielded two national teams, but lost on every front
టీమ్​ఇండియా
author img

By

Published : May 22, 2021, 9:16 AM IST

త్వరలో ఇంగ్లాండ్​, శ్రీలంక పర్యటనలకు రెండు వేర్వేరు బృందాలను పంపనుంది టీమ్​ఇండియా. ఇంగ్లీష్ గడ్డపై ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​, ఐదు టెస్టుల సిరీస్​ కోసం కోహ్లీ నేతృత్వంలో ఓ టీమ్, లంకకు ద్రవిడ్ కోచ్​గా మరో జట్టు వెళ్లనుంది. అయితే ఇలా ఏకకాలంలో రెండు టీమ్​లతో క్రికెట్​ మ్యాచ్​లు ఆడటం భారత్​కు కొత్తేమి కాదు. గతంలోనూ ఇలాంటి సందర్భాలు ఉన్నాయి. వాటి గురించే ఈ కథనం.

1998లో..

అది 1998. మలేసియాలో కామన్వెల్త్ గేమ్స్, పాకిస్థాన్​తో సహారా కప్​ ఒకేసారి ఉండటం వల్ల రెండు టీమ్​లను చెరో దానికి పంపించింది టీమ్​ఇండియా. కామన్వెల్త్​ క్రీడలకు వెళ్లిన వారిలో కెప్టెన్ అజయ్ జడేజా, సచిన్, అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్ ఉన్నారు. గంగూలీ, జవగల్ శ్రీనాథ్, రాహుల్ ద్రవిడ్, వెంకటేశ్ ప్రసాద్ సహారా కప్​లో పాల్గొనేందుకు వెళ్లారు. అయితే బీసీసీఐ చేసిన ఈ ప్రయోగం ఘోరంగా విఫలమైంది. రెండింటిలోనూ టీమ్​ఇండియా ఓడిపోయి, ఇంటిముఖం పట్టింది.

sachin ganguly
సచిన్-గంగూలీ

కౌలాలంపుర్​లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్​లో 16 క్రికెట్ జట్లు పాల్గొన్నాయి. మలేసియా, జమైకా, ఉత్తర ఐర్లాండ్ ఏ విభాగంలో ఉండగా.. భారత్, ఆస్ట్రేలియా, కెనడా, అంటిగ్వా బీ విభాగంలో ఉన్నాయి.

ఆసీస్​పై ఓడిపోయిన టీమ్​ఇండియా.. కెనడాపై గెలిచింది. వర్షం కారణంగా అంటిగ్వాతో మ్యాచ్​ రద్దయింది. దీంతో ఒక్కటే విజయంతో పోటీల నుంచి నిష్క్రమించింది భారత జట్టు. దీంతో ఆ జట్టును మళ్లీ సహారా కప్​ కోసం పంపించింది. ప్రత్యర్థి జట్టు పాకిస్థాన్ దీనిని వ్యతిరేకించింది. సచిన్, జడేజా, కుంబ్లే, రాబిన్ సింగ్​లను ఆడించాలని చూశారు. కానీ సయోధ్య కుదిరిన తర్వాత సచిన్, జడేజా జట్టులో ఉండేందుకు పాక్ అంగీకరించింది.

నాలుగో మ్యాచ్​ ఆడేటప్పటికే పాకిస్థాన్ 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. అయితే కామన్వెల్త్ గేమ్స్ తర్వాత సచిన్, కుటుంబంతో కలిసి ఖండాలాకు పర్యటనకు వెళ్లిపోయాడు. దీంతో జడేజా ఒక్కడే ఆ మ్యాచ్​ ఆడాడు. అయినప్పటికీ పాక్ 3-1 తేడాతో సిరీస్​ గెల్చుకుంది. చివరి మ్యాచ్​కు వచ్చిన సచిన్.. 77 పరుగులు చేసినప్పటికీ జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయాడు. దీంతో పాక్ 4-1 తేడాతో సహారా కప్​ సొంతం చేసుకుంది.

ఇది చదవండి: ఐపీఎల్​ కోసం బీసీసీఐ విశ్వప్రయత్నాలు.. ఎందుకు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.