ETV Bharat / sports

1983 వన్డే ప్రపంచకప్​@ 40 ఏళ్లు.. దిగ్గజ ప్లేయర్ల రీయూనియన్​.. ఫొటోలు చూశారా? - అదానీ డే

1983 World Cup : వెస్టిండీస్​ టీమ్​ను మట్టి కరిపించిన కపిల్​ సేన.. భారత్​కు మొట్టమొదటి ప్రపంచకప్​ను తెచ్చిపెట్టింది. దిగ్గజ మ్యాచ్​ల్లో ఒకటైన 1983 ప్రపంచ కప్​ ఆదివారంతో 40 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అప్పటి స్టార్​ ప్లేయర్స్​ అందరూ ఒక్కచోట చేరి సంబరాలు చేసుకున్నారు. ఆ విశేషాలు మీ కోసం..

1983 World Cup-winning team
1983 World Cup
author img

By

Published : Jun 25, 2023, 7:08 AM IST

1983 Cricket World Cup : 1983 జూన్​ 25.. అది వన్డే ప్రపంచకప్‌ ఫైనల్స్​.. వెస్టిండీస్​తో హోరా హోరీ మ్యాచ్​.. అక్కడేమో అరివీర భయంకరులు.. ఇక్కడ టీమ్​ఇండియాకు ముచ్చెమటలు.. కానీ అటువంటి సమయంలోనూ భయంకరమైన విండీస్​ జట్టుకు పరాజయాన్ని రుచి చూపించారు కపిల్‌ డెవిల్స్‌. అలా దేశానికి మొట్టమొదటి క్రికెట్‌ ప్రపంచకప్‌ను అందించి టీమ్​ఇండియా చరిత్రను తిరగరాసింది ఈ టీమ్​. కపిల్​ దేవ్​ ఆ కప్పును అందుకున్న మూమెంట్​ను క్రికెట్​ లవర్స్ అసలు మరచిపోరు. అంచనాలను మించి, అడ్డంకులను దాటి, అవమానాలను వెనక్కినెట్టి క్రికెట్​లో భారత్‌ తొలిసారి విశ్వవిజేతగా నిలిచిన రోజు ఆ రోజు.

దేశ క్రీడా రంగంలో మరుపురాని ఘట్టంగా.. క్రికెట్‌కు ఆదరణ పెంచిన ఓ ఘన విజయంగా ఇది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. వరుసగా తొలి రెండు (1975, 1979) ప్రపంచకప్‌లనూ వెస్టిండీసే గెలవగా.. 1983లో ఆ లెక్కలు మారాయి. ఇంగ్లాండ్‌, వేల్స్‌ ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్‌లో కపిల్‌ సేన.. అనూహ్య ప్రదర్శనతో మైదానంలో అదరగొట్టింది. దీంతో గ్రూప్‌- బిలో ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు, రెండు ఓటములతో వెస్టిండీస్‌ (5 విజయాలు) తర్వాత రెండో స్థానంతో నాకౌట్‌కు చేరింది భారత్‌. గ్రూప్‌ మ్యాచ్‌లో విండీస్‌ను టీమ్‌ఇండియా ఓడించడం విశేషం.

1983 Cricket World Cup team : ఇక సెమీస్‌లో ఇంగ్లాండ్‌ను మట్టి కరిపించిన భారత్‌.. ఫైనల్లో బలమైన విండీస్‌పై చారిత్రక విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలో ప్రపంచకప్‌ను అందుకుని ఆదివారంతో 40 వసంతాలు పూర్తవుతున్న సందర్భాన్ని మన స్టార్​ క్రికెటర్స్​ గుర్తుచేసుకున్నారు. 1983 బ్యాచ్​కు చెందిన భారత హీరోలు మళ్లీ ఒక్క చోట చేరి సంబరాలకు సిద్ధమయ్యారు.

1983 World Cup Team Photo : ఇక ఈ ఆనందమైన రోజున ఆనాటి జట్టు ఆటగాళ్లతో కలిసి దిగిన ఓ అరుదైన ఫొటోను శనివారం సునీల్‌ గావస్కర్‌ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశారు. ఇందులో కపిల్‌ దేవ్‌, దిలీప్‌ వెంగ్‌సర్కార్‌, శ్రీకాంత్‌, మొహిందర్‌ అమర్‌నాథ్‌, మదన్‌ లాల్‌,సందీప్‌ పాటిల్‌, సయ్యద్‌ కిర్మాణి, బల్విందర్‌ సింగ్‌, రోజర్‌ బిన్నీలతో పాటు అప్పటి టీమ్‌ మేనేజర్‌ మాన్‌ సింగ్‌ తదితరులున్నారు. ఆ విజేత జట్టులో భాగమైన యశ్‌పాల్‌ శర్మ రెండేళ్ల క్రితం కన్నముశారు.

Adani Day : మరోవైపు అదానీ గ్రూప్స్​ వ్యవస్థాపక దినోత్సవంతో పాటు గౌతమ్​ అదానీ పుట్టినరోజు సందర్భంగా 1983 ప్రపంచకప్‌ విజేత ఆటగాళ్లను ఆ సంస్థ సత్కరించింది. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌ నేపథ్యంలో 'జీతేంగే హమ్‌' అనే పేరుతో ఓ ప్రచార కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. దీనికి సంబంధించిన ఫోటోలను గౌతమ్​ అదానీ సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశారు.

  • Honoured by the presence of the Heroes of India's 1983 World Cup triumph on Adani Day. Their grit and resilience inspired an entire generation of Indians to think big. Privileged to join them in wishing our team victory at the 2023 Cricket World Cup. #JeetengeHum pic.twitter.com/bUTEQJCNOD

    — Gautam Adani (@gautam_adani) June 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"అదానీ డేన 1983 ప్రపంచ కప్ విజయం సాధించిన భారత హీరోలు ఈ వేదికపై ఉండటం మాకు ఎంతో గౌరవంగా ఉంది. వారి పట్టుదలతో పాటు స్థిరత్వం తరాలను ప్రేరేపించాయి. వారితో పాటు మేము కూడా 2023 క్రికెట్ ప్రపంచ కప్‌లో టీమ్​ ఇండియా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాము". అని అదానీ అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.