ETV Bharat / sports

ఐపీఎల్ మెగావేలానికి 1214 మంది క్రికెటర్లు - ఐపీఎల్ మెగావేలం రిజిస్ట్రేషన్స్

IPL mega auction: ఐపీఎల్-2022 కోసం జరగబోయే మెగావేలానికి రంగం సిద్ధమవుతోంది. వచ్చే నెల 12, 13న ఈ వేలం జరగనుంది. తాజాగా ఇందుకోసం రిజిస్టర్ చేసుకున్న ఆటగాళ్ల వివరాలను వెల్లడించింది పాలకమండలి.. ఈసారి మొత్తం 1214 మంది క్రికెటర్లు ఈ వేలంలో భాగం కానున్నారు.

IPL mega auction date, ఐపీఎల్ మెగా వేలం
IPL mega auction
author img

By

Published : Jan 22, 2022, 12:36 PM IST

Updated : Jan 22, 2022, 1:01 PM IST

IPL mega auction: ఐపీఎల్ 14వ సీజన్​ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈసారి మరో రెండు కొత్త టీమ్​లో వచ్చి చేరడం వల్ల మరింత మజా అందించేందుకు సిద్ధమయ్యారు నిర్వాహకులు. దీనికి సంబంధించిన మెగా వేలం వచ్చే నెలలో జరగనుంది. ఇప్పటికే ఈ లీగ్​ కోసం 1214 మంది ఆటగాళ్లు తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారని అధికారులు తెలిపారు. ఇందులో 896 మంది భారత ఆటగాళ్లు ఉండగా.. 318 మంది విదేశీ క్రికెటర్లు వేలానికి రెడీ అని ప్రకటించారు. విండీస్ విధ్వంసకర ఓపెనర్ క్రిస్ గేల్ ఈసారి వేలంలో పాల్గొనడం లేదు.

ఈ వేలంలో మొత్తం క్యాప్​డ్ భారత ఆటగాళ్లు (61 మంది), క్యాప్​డ్ ఇంటర్నేషనల్ (209 మంది), అసోసియేట్ (41 మంది), ఇంతకుముందు సీజన్లలో పాల్గొన్న అన్​క్యాప్​డ్ భారత ఆటగాళ్లు (143 మంది), గత సీజన్లలో పాల్గొన్న అన్​క్యాప్​డ్ విదేశీ ఆటగాళ్లు (6 మంది), అన్​క్యాప్​డ్ భారత ఆటగాళ్లు (692 మంది), అన్​క్యాప్​డ్ విదేశీ ఆటగాళ్లు (62) మంది తమ పేర్లను మెగావేలం కోసం రిజిస్టర్ చేసుకున్నారు.

"ప్రతి జట్టులోనూ 25 మంది ఆటగాళ్లను తీసుకునే వీలుంది. మొత్తం 217 ఆటగాళ్లను వేలం ద్వారా తీసుకునే అవకాశం ఉంది. ఇందులో 70 మంది విదేశీ క్రికెటర్లు ఉండవచ్చు" అని ఐపీఎల్ ఓ ప్రకటనలో తెలియజేసింది.

ఏ దేశం నుంచి ఎందరు?

విదేశీయుల్లో అత్యధికంగా ఆసీస్‌కు చెందిన 59 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు ఐపీఎల్‌ నిర్వాహకులు పేర్కొన్నారు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా (48), శ్రీలంక (36), ఇంగ్లాండ్ (30), న్యూజిలాండ్‌ (29), అఫ్గానిస్థాన్‌ (20) దేశాలు ఉన్నాయి. నేపాల్‌ (15), యూఎస్‌ఏ (14), నమీబియా (5), ఒమన్ (3), భూటాన్‌ (1), యూఏఈ (1), నెదర్లాండ్స్‌ (1), స్కాట్లాండ్‌ వంటి అసోసియేట్ దేశాల ఆటగాళ్లూ మెగా వేలంలో పేర్లను రిజిస్టర్ చేసుకోవడం విశేషం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చూడండి: సచిన్​ వీరాభిమాని సుధీర్​​ను కొట్టిన పోలీసులు.. కారణం ఇదే!

Last Updated : Jan 22, 2022, 1:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.