ETV Bharat / sports

Olympics: 'కోచ్​లు, ఫిజియోల సంఖ్యను పెంచండి'

ఒలింపిక్స్​కు అర్హత సాధించిన షట్లర్లతో పాటు నలుగురు కోచ్​లను, ఇద్దరు ఫిజియోలను టోక్యో పంపించాలని కోరుతూ బ్యాడ్మింటన్​ ఆఫ్ ఇండియా.. ఇండియన్​ ఒలింపిక్​ అసోసియేషన్​కు లేఖ రాసింది. మొత్తం అథ్లెట్ల సంఖ్యలో మూడో వంతుకు మించకుండా సహాయక సిబ్బంది వెళ్లాలనేది ఒలింపిక్స్​ నిబంధన.

bai, ioa
బ్యాడ్మింటన్​ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్​ ఒలింపిక్​ అసోసియేషన్
author img

By

Published : Jun 8, 2021, 11:02 PM IST

ఇండియన్​ ఒలింపిక్ అసోసియేషన్​కు బ్యాడ్మింటన్​ ఆఫ్ ఇండియా లేఖ రాసింది. ఒలింపిక్స్​కు అర్హత సాధించిన షట్లర్లతో పాటు టోక్యో వెళ్లడానికి నలుగురు కోచ్​లను అనుమతించాలని కోరింది. ఇద్దరు ఫిజియోలను వారితో పాటు ప్రయాణించడానికి అంగీకరించాలని పేర్కొంది.

"అవును, మేము ఇండియన్ ఒలింపిక్​ అసోసియేషన్​కు లేఖ రాశాం. పుల్లెంల గోపిచంద్​తో సహా నలుగురు కోచ్​లను షట్లర్లతో పాటు పంపాలని కోరాం. అలాగే ఇద్దరు ఫిజియోలను వారితో పాటు వెళ్లడానికి అంగీకరించాల్సిందిగా అభ్యర్థించాం. ఈ విషయంలో సానుకూల నిర్ణయం వస్తుందని మేమనుకుంటున్నాం."

-బ్యాడ్మింటన్ అసోసియేషన్​ ఆఫ్ ఇండియా.

టోక్యో ఒలింపిక్స్​ నిబంధనల ప్రకారం మొత్తం అథ్లెట్ల సంఖ్యలో మూడో వంతు మాత్రమే సహాయక సిబ్బంది ఉండాలి. కాగా, బ్యాడ్మింటన్​ నుంచి పీవీ సింధుతో పాటు సాయి ప్రణీత్​, డబుల్స్ జోడీ చిరగా శెట్టీ, సాత్విక్ రాజ్​ రాంకీ రెడ్డి అర్హత సాధించారు.

ఇదీ చదవండి: Olympics: భారత అథ్లెట్లపై దేశవ్యాప్త కార్యక్రమాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.