జపాన్ ఓపెన్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఫామ్‌లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కిదాంబి శ్రీకాంత్.. బుధవారం జరిగిన మ్యాచ్‌లో మరో భారత షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ చేతిలో తొలి రౌండ్లోనే ఓటమి పాలయ్యాడు. అద్భుతంగా ఆడిన ప్రణయ్, గేమ్‌ను 59 నిమిషాల్లోనే ముగించి 21-13, 11-21, 22-20 పాయింట్ల తేడాతో గెల్చుకున్నాడు.
-
Prannoy's last laugh!😆
— BAI Media (@BAI_Media) July 24, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Making strong impressions @PRANNOYHSPRI cruises into the second round of #JapanOpenSuper750 as he created an upset defeating World No 10 and top 🇮🇳 shuttler, Kidambi Srikanth 13-21; 21-11, 21-20.
Way to go HS! 💪⚡️#IndiaontheRise #badminton pic.twitter.com/v0jTADGp4H
">Prannoy's last laugh!😆
— BAI Media (@BAI_Media) July 24, 2019
Making strong impressions @PRANNOYHSPRI cruises into the second round of #JapanOpenSuper750 as he created an upset defeating World No 10 and top 🇮🇳 shuttler, Kidambi Srikanth 13-21; 21-11, 21-20.
Way to go HS! 💪⚡️#IndiaontheRise #badminton pic.twitter.com/v0jTADGp4HPrannoy's last laugh!😆
— BAI Media (@BAI_Media) July 24, 2019
Making strong impressions @PRANNOYHSPRI cruises into the second round of #JapanOpenSuper750 as he created an upset defeating World No 10 and top 🇮🇳 shuttler, Kidambi Srikanth 13-21; 21-11, 21-20.
Way to go HS! 💪⚡️#IndiaontheRise #badminton pic.twitter.com/v0jTADGp4H
మాజీ ప్రపంచ నంబర్ వన్ ఆటగాడైన శ్రీకాంత్.. ఈ సీజన్లో ఫామ్ అందుకోలేక తంటాలు పడుతున్నాడు. గత వారం ఇండోనేసియా ఓపెన్‌లోనూ రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు.
మరో అన్‌సీడెడ్ ఆటగాడు సమీర్ వర్మ, డెన్మార్క్‌కు చెందిన ఆండ్రెస్ ఆంటోసెన్ చేతిలో 17-21, 12-21 పాయింట్ల తేడాతో గేమ్‌ను చేజార్చుకున్నాడు.
మిక్స్డ్ డబుల్స్‌లో ప్రణవ్-సిక్కి రెడ్డి జోడీ, చైనాకు చెందిన జెండ్ సీ వై- హుయాంగ్ యా క్వియాంగ్ చేతిలో 11-21, 14-21 తేడాతో ఓటమి పాలయ్యారు.
ఇది చదవండి: 'హిమ' పాంచ్ పటాకా- నెలలో 5 స్వర్ణాలు