భారత స్టార్ బాడ్మింటన్ క్రీడాకారిణీ పీవీ సింధు.. స్విట్జర్లాండ్లో జరుగుతున్న ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ పోటీల్లో తుదిపోరుకు అర్హత సాధించడం సింధుకు ఇది మూడోసారి.
శనివారం జరిగిన సెమీఫైనల్లో ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్ చెన్ యు ఫై(చైనా)ను 21-7, 21-14 పాయింట్ల తేడాతో ఓడించింది సింధు. 40 నిమిషాల్లోనే ఈ గేమ్ పూర్తయింది. ఆదివారం జరిగే తుదిపోరులో రచనోక్ లేదా ఒకుహరాతో తలపడనుంది.
గత రెండు సీజన్లలోనూ ఇదే టోర్నీలో వెండి పతకాల సాధించింది సింధు. తొలి నుంచి దూకుడుగా ఆడిన సింధు.. ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ను చేజిక్కుంచుకుంది.
ఇది చదవండి: 36 ఏళ్లనాటి రికార్డ్ బ్రేక్ చేసిన సాయి ప్రణీత్