ETV Bharat / sports

PV Sindhu: సెమీస్‌లో సింధు- పురుషుల విభాగంలో నిరాశ!

ఫ్రెంచ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ (French Open Badminton) టోర్నమెంట్​లో పీవీ సింధు దూసుకెళ్తోంది. శుక్రవారం జరిగిన క్వార్టర్​ ఫైనల్లో థాయ్​లాండ్​కు చెందిన బుసానన్​పై విజయం సాధించి సెమీస్​లోకి అడుగుపెట్టింది (PV Sindhu News).

pv sindhu
పీవీ సింధు
author img

By

Published : Oct 30, 2021, 7:05 AM IST

ఫ్రెంచ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ (French Open Badminton) టోర్నమెంట్​లో భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు సెమీఫైనల్లో ప్రవేశించింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో మూడో సీడ్‌ సింధు 21-14, 21-14తో ఎనిమిదో సీడ్‌ బుసానన్‌ (థాయ్‌లాండ్‌)పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో సింధు (PV Sindhu News) జోరు ముందు బుసానన్‌ నిలువలేకపోయింది. రెండో గేమ్‌లోనూ భారత స్టార్‌దే ఆధిపత్యం. అయితే 8-8తో ఒకసారి బుసానన్‌ స్కోరు సమం చేసినా.. ఆ తర్వాత సింధు ప్రత్యర్థికి దొరకలేదు. వరుస పాయింట్లతో అంతరాన్ని పెంచుకుంటూపోయిన ఆమె చివరికి విజయాన్ని అందుకుంది.

పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌ ఓడిపోయాడు. క్వార్టర్స్‌లో అతడు 21-17, 21-15తో హొ క్వాంగీ (కొరియా) చేతిలో పరాజయం చవిచూశాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌శెట్టి పోరాటం ముగిసింది. క్వార్టర్స్‌లో సాత్విక్‌ జోడీ 21-18, 18-21, 17-21తో అరోన్‌ చియా-సొ వుయ్‌ (మలేసియా) చేతిలో పోరాడి ఓడింది.

ఇదీ చూడండి: ఆ విషయంలో నేను అదృష్టవంతురాలిని: పీవీ సింధు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.