ETV Bharat / sports

స్విస్‌ ఓపెన్‌ ప్రిక్వార్టర్స్‌లో సింధు, శ్రీకాంత్‌ - pv sindhu

స్విస్‌ ఓపెన్‌ సూపర్‌ 300లో భారత బ్యాడ్మింటన్ స్టార్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ ప్రిక్వార్టర్స్​కు దూసుకెళ్లారు. పురుషుల డబుల్స్​లో సాత్విక్ సాయిరాజు- చిరాగ్​ జోడీ ప్రిక్వార్టర్స్​లో అడుగుపెట్టింది.

sindhu, srikanth enter prequarter of Swiss Open 2021
స్విస్‌ ఓపెన్‌ పిక్వార్టర్స్‌లో సింధు, శ్రీకాంత్‌
author img

By

Published : Mar 4, 2021, 7:00 AM IST

స్విస్‌ ఓపెన్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌ ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. బుధవారం మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో సింధు 21-16, 21-19తో ఇగిత్‌ నెస్లిహాన్‌ (టర్కీ)పై విజయం సాధించింది. రెండో సీడ్‌ సింధు తర్వాతి పోరులో ఇరిస్‌ వాంగ్‌ (అమెరికా)తో తలపడుతుంది.

పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో నాలుగో సీడ్‌ శ్రీకాంత్‌ 18-21, 21-18, 21-11తో సహచర ఆటగాడు సమీర్‌ వర్మపై విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో సౌరభ్‌వర్మ 21-19, 21-18తో క్రిస్టియన్‌ (స్విట్జర్లాండ్‌)పై గెలిచాడు. పురుషుల డబుల్స్‌లో రెండో సీడ్‌ సాత్విక్‌ సాయిరాజు- చిరాగ్‌శెట్టి జోడీ 21-18, 19-21, 21-16తో క్రిస్టోఫర్‌- మాథ్యూ (స్కాట్లాండ్‌) జంటపై నెగ్గి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది.

ఇదీ చూడండి: మార్చి 19న బాక్సింగ్​ రింగ్​లోకి విజేందర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.