ETV Bharat / sports

ఆస్ట్రేలియన్ ఓపెన్​లో సింధు, సమీర్ శుభారంభం - samir

సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్​లో సింధు, సమీర్ వర్మ రెండో రౌండుకు చేరుకున్నారు. సింధు ఛోయిరున్నిసాపై గెలవగా... మలేషియా ఆటగాడు లీ జీపై సమీర్ విజయం సాధించాడు.

సింధు - సమీర్​
author img

By

Published : Jun 5, 2019, 8:26 PM IST

ఆస్ట్రేలియా ఓపెన్​లో భారత షట్లర్లు శుభారంభం చేశారు. తెలుగుతేజం పీవీ సింధు, సమీర్​ వర్మ రెండో రౌండ్​కు చేరుకున్నారు. సింధు ఇండోనేషియా క్రీడాకారిణీ ఛోయిరున్నిసాపై గెలుపొందగా.. సమీర్ మలేషియా ఆటగాడు లీ జీ పై విజయం సాధించాడు.

21-14, 21-9 తేడాతో వరుస సెట్లలో ఇండోనేషియా ఛోయిరున్నిసాను చిత్తుచేసింది సింధు. మహిళల సింగిల్స్​ విభాగంలో జరిగిన ఈ మ్యాచ్​ ఆరంభం నుంచి సింధునే పైచేయి సాధించింది.

గత నెల సుధీ​మన్ కప్​లో మలేషియా ఆటగాడు లీ జీ చేతిలో పరాజయం పొందిన సమీర్​వర్మ ఈ మ్యాచ్​లో సత్తా చాటాడు. 21-15, 16-21, 21-12 తేడాతో లీని ఓడించాడు.

పురుషుల డబుల్స్​లో సాత్విక్​ - చిరాగ్ శెట్టి జోడి.. మనదేశానికే చెందిన మను ఆత్రి - సుమిత్​ రెడ్డి ద్వయాన్ని 21-12, 21-16 తేడాతో ఓడించింది.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.