ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణం సాధించిన పీవీ సింధుకు దిల్లీ ఎయిర్పోర్టులో ఘనస్వాగతం లభించింది. ముందుగా క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజును కలిసిన ఈ క్రీడాకారిణి అనంతరం ప్రధాని వద్దకు వెళ్లింది. సింధుతో పాటు గోపీచంద్, కిరణ్ రిజిజు మోదీని కలిసిన వారిలో ఉన్నారు.
"భారత్ గర్వించదగ్గ క్రీడాకారిణి పీవీ సింధును కలిసినందుకు ఆనందంగా ఉంది. ప్రపంచ ఛాంపియన్గా నిలిచిందుకు అభినందనలు. భవిష్యత్లో మరిన్ని పతకాలు సాధించాలి".
-మోదీ, ప్రధాని
ప్రపంచ ఛాంపియన్ షిప్లో జపాన్ క్రీడాకారిణి ఒకుహరపై 21-7, 21-7 తేడాతో గెలిచి రికార్డు సృష్టించింది సింధు. ఈ టోర్నీ గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా నిలిచింది.
ఇవీ చూడండి.. ప్రధానిని కలవనున్న సింధు, గోపిచంద్