ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు... కర్ణాటకలోని మైసూరు దసరా ఉత్సవాల్లో పాల్గొంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యడియూరప్పతో కలిసి నజార్బాద్లోని చాముండి విహార్ స్టేడియంలో రాష్ట్రస్థాయి దసరా క్రీడలను ప్రారంభించింది. తర్వాత మహారాజా కళాశాల మైదానంలో యువ దసరా వేడుకలో పాల్గొంది.
తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు
కర్ణాటక ప్రభుత్వం జరిపే మైసూరు దసరా ఉత్సవాలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. ఈ సంబరాలు చూసేందుకు దేశ, విదేశాల నుంచి లక్షల సంఖ్యలో ప్రజలు తరలి వస్తారు. కర్ణాటక సంప్రదాయం, సంస్కృతి, కళలకు నిదర్శనంగా తొమ్మిది రోజులు పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఏడాది జరగనున్న ఉత్సవాలు 410వ సంవత్సరం జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.