ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటికే నాలుగు పతకాలు కొల్లగొట్టిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. ఐదో పతకానికి అడుగు దూరంలో నిలిచింది. మహిళల సింగిల్స్‌లో ఆమె సెమీస్‌లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో ... 12-21, 23-21, 21-19 తేడాతో రెండో సీడ్ తై జు యింగ్(చైనీస్ తైపీ)పై గెలిచింది సింధు. ఇద్దరి మధ్య హోరాహోరీగా జరిగిన పోరులో చివరకు తెలుగు అమ్మాయి ఆధిపత్యం ప్రదర్శించింది.
తొలి సెట్లో దాదాపు 9 పాయింట్ల తేడాతో ఓడిపోయిన సింధు... రెండు, మూడు సెట్లలో మాజీ ప్రపంచ నెం.1కు తిరుగులేని పోటీ ఇచ్చింది.
మరో మ్యాచ్‌లో సాయి ప్రణీత్ సెమీఫైనల్ బెర్తు కోసం జోనాతన్ క్రిస్టీ(ఇండోనేషియా)తో తలపడనున్నాడు.