బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన పీవీ సింధు విజయానికి చిహ్నంగా ఆమె సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు ప్రముఖ సాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్. ఒడిశాలోని పూరి బీచ్‌లో సింధు రూపం తయారుచేసి బ్యాడ్మింటన్ క్వీన్‌కు అభినందనలు తెలిపారు.
2016 రియో ఒలింపిక్స్‌లో సింధు రజతం నెగ్గినప్పుడూ ఇలాగే ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. పద్మశ్రీ పురస్కార గ్రహీతైన సుదర్శన్ పట్నాయక్ ప్రముఖ వ్యక్తులు, సంఘటనలు జరిగినపుడు సైకత శిల్పాల ద్వారా తన భావాన్ని వ్యక్తపరుస్తుంటారు.
స్విట్జర్లాండ్ బాసెల్ వేదికగా జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్లో జపాన్‌కు చెందిన ఒకుహరపై గెలిచి సింధు స్వర్ణం దక్కించుకుంది. 21-7, 21-7 తేడాతో వరుస సెట్లలో నెగ్గి ఈ టోర్నీలో పసిడి కైవసం చేసుకున్న తొలి భారత ప్లేయర్‌గా కీర్తి గడించింది.
ఇది చదవండి: విమర్శలకు ఇదే నా సమాధానం: సింధు