ETV Bharat / sports

సైనా, శ్రీకాంత్​కు​ ఒలింపిక్​ బెర్తులు సందేహమే! - పారుపల్లి కశ్యప్​ న్యూస్​

దేశంలో బ్యాడ్మింటన్‌ విప్లవానికి కారణమైన అమ్మాయి సైనా నెహ్వాల్‌. భారత పురుషుల బ్యాడ్మింటన్‌లో ఎవరూ అందుకోని ఘనతల్ని సాధించిన ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌. ఈ ఇద్దరి ఒలింపిక్స్‌ ఆశలు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. ఒలింపిక్స్‌ ముంగిట జరగాల్సిన అర్హత టోర్నీలన్నీ వాయిదా పడటం వల్ల వీళ్లిద్దరూ టోక్యోకు వెళ్లడం సందేహంగా మారింది.

Saina Nehwal, Kidambi Srikanth in doubt over Olympic berths
సైనా, శ్రీకాంత్​ ఒలింపిక్​ బెర్తులపై సందేహమే!
author img

By

Published : Mar 22, 2020, 7:48 AM IST

ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంకు.. ఎన్నో సూపర్‌ సిరీస్‌ టైటిళ్లు.. ఓ ఒలింపిక్‌ పతకం.. మూడుసార్లు ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం.. సైనా నెహ్వాల్‌ ఖాతాలో ఇలా ఎన్నో ఘనతలున్నాయి. 2008లో మొదలుపెట్టి వరుసగా మూడు పర్యాయాలు ఒలింపిక్స్‌ ఆడింది సైనా నెహ్వాల్‌. 2012లో కాంస్య పతకాన్ని గెలిచింది. అలాంటి క్రీడాకారిణికి ఈసారి ఒలింపిక్‌ బెర్తు దక్కేలా లేదు. అలాగే ఒకే ఏడాది నాలుగు సూపర్‌ సిరీస్‌ టైటిళ్లు గెలిచి ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంకునూ దక్కించుకున్న శ్రీకాంత్‌కు ఒలింపిక్‌ బెర్తు కష్టంగానే ఉంది.

ప్రస్తుతం మహిళల సింగిల్స్‌లో సైనా ర్యాంకు 20.. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్‌ ర్యాంకు 14. అయితే సింగిల్స్‌లో టాప్‌-16, డబుల్స్‌లో టాప్‌-8 ర్యాంకుల్లో ఉన్న క్రీడాకారులే ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో జరిగే కాంటినెంటల్‌ ఛాంపియన్‌షిప్‌లు, సూపర్‌ సిరీస్‌ల్లో సత్తాచాటి తమ ర్యాంకుల్ని మెరుగుపరుచుకుని ఒలింపిక్స్‌ బెర్తులు సాధించాలని వీరు భావించారు. కానీ కరోనా వైరస్‌ కారణంగా ఈ రెండు నెలల్లో జరగాల్సిన అయిదు టోర్నీలను బీడబ్ల్యూఎఫ్‌ వాయిదా వేసింది. అయితే ఒలింపిక్స్‌ అర్హతకు ఏప్రిల్‌ 30 నాటికి ఉండే ర్యాంకుల్నే బీడబ్ల్యూఎఫ్‌ పరిగణనలోకి తీసుకుంటుంది. మధ్యలో టోర్నీలేవీ జరగని పక్షంలో ర్యాంకింగ్‌ నిబంధనల ప్రకారం అప్పటికి సైనా స్థానం 22గా ఉంటుంది. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్‌ ర్యాంకు అంతే ఉంటుందని అంచనా.

"సైనా రెండు టోర్నీల్లో క్వార్టర్‌ ఫైనల్‌, ఒకదాంట్లో సెమీస్‌ చేరినా.. లేదంటే రెండు టోర్నీల్లో సెమీస్‌కు అర్హత సాధించినా.. ఒలింపిక్స్‌కు వెళ్తుంది. స్విస్‌ ఓపెన్‌, ఇండియా ఓపెన్‌ టోర్నీల్లో ఆమె కచ్చితంగా సెమీస్‌కు వెళ్తుందని ఆశించాం. కానీ ఆ టోర్నీలు వాయిదా పడ్డాయి. వాటి భవితవ్యం ఏంటో తెలియదు. బీడబ్ల్యూఎఫ్‌ ఎలా క్రీడాకారుల్ని ఒలింపిక్స్‌కు ఎంపిక చేయబోతోందో అర్థం కావట్లేదు."

- పారుపల్లి కశ్యప్‌, భారత షట్లర్​

Saina Nehwal, Kidambi Srikanth in doubt over Olympic berths
కిదాంబి శ్రీకాంత్​

ఎవరికి అవకాశం?

బీడబ్ల్యూఎఫ్‌ నిబంధనల ప్రకారం ప్రతి దేశం నుంచి మహిళల సింగిల్స్‌లో ఇద్దరికి, పురుషుల సింగిల్స్‌లో ఇద్దరికి గరిష్టంగా అవకాశముంటుంది. వాళ్లు తుది గడువు నాటికి టాప్‌-16 ర్యాంకుల్లో ఉండాలి. పురుషుల డబుల్స్‌, మహిళల డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఒక్కో జోడీ చొప్పున అవకాశం దక్కించుకుంటుంది. ఆ జోడీలు టాప్‌-8లో ఉండాలి.

అయితే డబుల్స్‌లో ఎవ్వరూ టాప్‌-8లో లేకపోతే.. మూడు విభాగాల్లో అత్యుత్తమ ర్యాంకు ఉన్న ఒక్క జోడీకి ఒలింపిక్స్‌ బెర్తు దక్కుతుంది. దీని ప్రకారం ప్రస్తుతం మహిళల సింగిల్స్‌లో ఏడో ర్యాంకులో ఉన్న సింధు, పురుషుల సింగిల్స్‌లో 13వ స్థానంలో ఉన్న సాయిప్రణీత్‌, పురుషుల డబుల్స్‌లో 10వ స్థానంలో ఉన్న సాత్విక్‌ సాయిరాజు-చిరాగ్‌ శెట్టి టోక్యోకు వెళ్లే అవకాశముంది.

సైనా నెహ్వాల్​

ఏం చేస్తుందో?

టోర్నీలు జరిగితే ర్యాంకులు మెరుగుపరుచుకుని ఒలింపిక్స్‌కు వెళ్లాలని సైనా, శ్రీకాంత్‌లతో పాటు మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-సిక్కిరెడ్డి (ర్యాంకు 28), మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సిక్కి-ప్రణవ్‌ (27), అశ్విని-సాత్విక్‌ (36) జోడీలు ఆశించాయి. అయితే డబుల్స్‌ జోడీలు టాప్‌-8లోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి అందరిలోకి మెరుగైన ర్యాంకుతో ఉన్న సాత్విక్‌-చిరాగ్‌లకే బెర్తు దక్కుతుందని అంచనా. టోర్నీలు సవ్యంగా సాగి ఉంటే.. సైనా, శ్రీకాంత్‌ సత్తా చాటి తుది గడువు నాటికి టాప్‌-16లో ఉండటానికి మెరుగైన అవకాశాలే ఉన్నాయి.

కానీ వారికిప్పుడు అవకాశం లేకపోయింది. ఒలింపిక్స్‌ యథావిధిగా జులై-ఆగస్టు నెలల్లోనే జరిగితే.. తుది గడువును పొడిగించి మేలో అర్హత టోర్నీలు నిర్వహించి ఆ తర్వాతే బీడబ్ల్యూఎఫ్‌ ఒలింపిక్‌ బెర్తులు ఖరారు చేస్తుందా.. లేక ఏప్రిల్‌ 30 నాటికి ఉన్న ర్యాంకుల్ని పరిగణనలోకి తీసుకుని బెర్తులు తేల్చేస్తుందా అన్నది ఉత్కంఠభరితంగా మారింది.

ఇదీ చూడండి.. "నా ఫేస్​బుక్​ అకౌంట్ హ్యాక్​ చేసింది ఈ అమ్మాయే"

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.