ఔట్‌డోర్ బ్యాడ్మింటన్‌కు(ఎయిర్ బ్యాడ్మింటన్) భారత షట్లర్లు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. భారత స్టార్ సైనా నెహ్వాల్ సహా చాలామంది ఈ ఫార్మాట్‌పై సానుకూలంగా స్పందిస్తున్నారు. రిటైరైన క్రీడాకారులు ఎయిర్ బ్యాడ్మింటన్‌ను ప్రత్యామ్నాయ కెరీర్‌గా ఎంచుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు.
"మనదేశంలో చాలామంది బ్యాడ్మింటన్‌ను ఔట్‌డోర్‌లోనే ఆడుతున్నారు. మేము కూడా కుటుంబంతో కలిసి ఆరుబయట షటిల్ ఆడినవాళ్లమే. ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్(బీడబ్ల్యూఎఫ్) ఈ ఫార్మాట్‌ను తీసుకొచ్చి గొప్ప ముందడుగేసింది". -సైనా నెహ్వాల్, భారత స్టార్ షట్లర్.
ఈ ఫార్మాట్‌తో బ్యాడ్మింటన్‌కు ఆదరణ పెరుగుతుందని, చాలా మంది క్రీడాకారులకు అవకాశం దొరుకుతుందని సైనా అభిప్రాయపడింది. ఇన్డోర్, ఔట్‌డోర్ విధానాల మధ్య పెద్ద తేడా లేదని తెలిపింది. గాలి, తేమ లాంటి కొన్ని మార్పులే ఉన్నాయని చెప్పింది.
ఎయిర్బ్యాడ్మింటన్ను ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్(బీడబ్ల్యూఎఫ్) గత వారం చైనాలోని గ్వాంగ్జౌలో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.