జపాన్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాయి ప్రణీత్ మంచి ప్రదర్శన చేశాడు. తొలి మ్యాచ్‌లో జోరు ప్రదర్శించి 10వ సీడ్ జపాన్ ఆటగాడు కెంటాపై 21-17, 21-13 తేడాతో గెలిచాడు. 42 నిముషాల పాటు జరిగిన ఈ పోరులో పైచేయి సాధించాడు 23వ సీడ్ ప్రణీత్. ఫలితంగా 'బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-750'గా పిలిచే ఈ టోర్నీలో సాఫీగా రెండో రౌండ్ చేరాడు. తర్వాతి మ్యాచ్‌లో జపాన్ ప్లేయర్ కంటా సునేయమాతో తలపడనున్నాడీ తెలుగు తేజం.
భారత స్టార్ క్రీడాకారులు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ బుధవారం తొలి మ్యాచ్ ఆడనున్నారు. ఐదో సీడ్ సింధు చైనా క్రీడాకారిణి హన్ యూతో తలపడనుంది. మరో భారత ఆటగాడు హెచ్.ఎస్ ప్రణయ్‌తో పోటీపడనున్నాడు శ్రీకాంత్.
మిక్స్డ్ డబుల్స్‌లో ముందంజ...
జపాన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్‌లో భారత జోడీ సాత్విక్, అశ్వినీ పొన్నప్ప ముందంజ వేశారు. తొలి మ్యాచ్‌లో జర్మనీ ద్వయం మార్విన్, లిండాపై 21-14, 21-19 తేడాతో విజయం సాధించారు.
మెన్స్ నిరాశ...
భారత పురుషుల ద్వయం మను ఆత్రే, సుమీత్ రెడ్డి మొదటి మ్యాచ్‌లోనే ఇంటి ముఖం పట్టారు. 12-21, 16-24 తేడాతో మలేషియా గోజేఫీ, నూర్ ఇజుద్దీన్ జోడీ చేతిలో ఓటమిపాలయ్యారు.