ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు.. బ్యాడ్మింటన్ కోర్టులో అడుగుపెట్టింది. కరోనా ప్రభావం వల్ల ఐదు నెలలు ఇంటికే పరిమితమైన ఈ షట్లర్, బుధవారం ప్రాక్టీస్ ఆరంభించింది. క్రీడాకారుల సాధనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిన నేపథ్యంలో.. ప్రాక్టీస్ కోసం హైదరాబాద్లోని సుచిత్ర బ్యాడ్మింటన్ అకాడమీకి వెళ్లింది. అయితే సుదీర్ఘ కాలం ఆటకు దూరంగా ఉన్నందున తొలిరోజు రాకెట్ పట్టలేదు. వ్యక్తిగత శిక్షకుడు శ్రీకాంత్ ఆధ్వర్యంలో రెండున్నర గంటల పాటు జిమ్‌లో కసరత్తులు చేసింది.
ఐదు నెలల తర్వాత ప్రాక్టీస్.. రాకెట్ పట్టని సింధు - షట్లర్ సింధు
దాదాపు ఐదు నెలల విరామం తర్వాత కోర్టులో అడుగుపెట్టింది స్టార్ షట్లర్ సింధు. అయితే తొలిరోజు జిమ్‌లో తీవ్ర కసరత్తులు చేసింది.