భారత స్టార్ షట్లర్, ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు.. మలేసియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నీ నుంచి నిష్క్రమించింది. కౌలాలంపూర్లో జరిగిన ఈ మ్యాచ్లో చైనీస్ తైపీ క్రీడాకారిణి తైజుంగ్ చేతిలో 21-16, 21-16 తేడాతో ఓడిపోయింది.
సింధుకి, తైజుంగ్ చేతిలో ఇది వరసగా రెండో ఓటమి.. గత అక్టోబరులో ఫ్రెంచ్ ఓపెన్లో ఈమెపైనే ఓడిపోయింది సింధు. వీరిద్దరూ ఇప్పటివరకు 17సార్లు తలపడగా 12 సార్లు తైజుంగ్, 5 సార్లు పీవీ గెలిచింది.
ఈరోజు జరిగిన మ్యాచ్లో తొలి సెట్లో సింధు కొంత ప్రతిఘటించినా, 21-16 తేడాతో కోల్పోయింది. రెండో సెట్లో ప్రత్యర్థి షట్లర్ పూర్తి ఆధిపత్యం చెలాయించడం వల్ల అందులోనూ ఓటమిపాలై మ్యాచ్ను పోగుట్టుకుంది.