ఇటీవలే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన భారత ప్రముఖ షట్లర్ పీవీ సింధు.. చైనా ఓపెన్‌లో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో మాజీ నంబర్.1 క్రీడాకారిణి లీ యూరేపై 21-18, 21-12 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా ప్రీక్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది.
పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్లో భారత్‌కు చెందిన సాయిప్రణీత్.. థాయ్‌లాండ్ షట్లర్ సుప్పాన్యుతో హోరాహోరీగా తలపడ్డాడు. 72 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌ను 21-19, 23-21 తేడాతో గెలుపొందాడు.
అంతకు ముందు జరిగిన మహిళల మ్యాచ్‌లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్.. బుసనన్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. 44 నిమిషాలు జరిగిన ఈ గేమ్‌ను 10-21, 17-21 తేడాతో కోల్పోయింది.
ఇది చదవండి: చైనా ఓపెన్ నుంచి సైనా నెహ్వాల్ ఔట్