టొయోటా థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్ 1000 టోర్నీలో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ శుభారంభం చేశారు. తొలి రౌండ్లలో అలవోకగా విజయం సాధించారు.
మహిళల సింగిల్స్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన ప్రపంచ 12వ సీడ్ బుసానన్ను 21-17,21-13 తేడాతో వరుస సెట్లలో ఓడించింది సింధు. ఫలితంగా రెండో రౌండ్‌కు చేరింది.
యోనెక్స్ థాయ్‌లాండ్ ఓపెన్లో గాయం కారణంగా వైదొలిగిన కిదాంబి శ్రీకాంత్.. స్థానిక ఆటగాడు థమ్మాసిన్పై 21-11,21-11 తో నెగ్గి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. మ్యాచ్ 37 నిమిషాల్లోనే ముగియడం విశేషం.
అంతకుముందు జరిగిన యోనెక్స్ థాయ్‌లాండ్ ఓపెన్లో సింధు సహా టోర్నీలో పాల్గొన్న భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్లు అత్యంత చెత్త ప్రదర్శన చేశారు. ఏ ఒక్కరూ కనీసం రెండో రౌండ్ దాటలేదు.
ఇదీ చూడండి : థాయ్‌లాండ్ ఓపెన్: తొలి రౌండ్లోనే సింధుకు షాక్