'బ్యాడ్మింటన్ కోర్టులోనే ఆడాలి.. అప్పుడే గెలుస్తాం. కరోనాతో ఫైట్ చేయాలంటే మనం ఇంట్లోనే ఉండాలి... భౌతికదూరం పాటిస్తేనే కొవిడ్-19పై విజయం సాధించగలం.. మనకు సహాయం అందించడానికి 104 హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ సూచనలు పాటిద్దాం.. ఇంట్లోనే ఉందాం.. కరోనాను కలిసి ఎదుర్కొందాం' అని పీవీ సింధు పిలుపునిచ్చారు.
దేశంలోని 40 మంది ప్రముఖ క్రీడాకారులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కరోనా పరిస్థితిపై నిన్న చర్చించారు. క్రీడాకారులంతా వారి సామాజిక మాధ్యమ ఖాతాల ద్వారా కొవిడ్-19కు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో పీవీ సింధు కరోనాపై వీడియో సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఇదీ చదవండి: రికార్డు స్థాయిలో కేసులు... ఉలిక్కిపడ్డ భాగ్యనగరం