కొత్త ఏడాదికి కొత్త టైటిల్‌తో ఘన స్వాగతం పలికిన ప్రపంచ ఛాంపియన్ కెంటో మోమోటా(జపాన్) రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు . టైటిల్ గెలిచి స్వదేశానికి తిరుగు ప్రయాణంలో ఈ ఘటన జరిగింది.
ఏమైంది..?
జనవరి 12 ముగిసిన మలేషియా మాస్టర్స్ ఫైనల్లో మాజీ ప్రపంచ ఛాంపియన్ విక్టర్ అక్సెల్సన్పై... గెలిచి టైటిల్ కైవసం చేసుకున్నాడు మోమోటా. అనంతరం టోర్నీ వేదిక నుంచి ఆ దేశ రాజధాని పుత్రజయకు వెళ్తుండగా.. ఈ ఆటగాడు ప్రయాణిస్తున్న చిన్న వ్యాన్ ఓ ట్రక్‌ను ఢీకొంది. ఫలితంగా వాహనం ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. ఇందులో ఈ జపాన్ షట్లర్‌తో పాటు అతడి కోచ్, వ్యక్తిగత సహాయకులు కూడా ఉన్నారు. అందరూ చిన్న చిన్న గాయాలతో బయటపడగా.. వ్యాన్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారిక వర్గాలు ప్రకటించాయి.
మోమోటా సహా మిగిలిన ఆటగాళ్లను దగ్గరలోని పుత్రజయ హాస్పిటల్‌కు వైద్య సేవల కోసం తరలించారు. ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మలేషియా బ్యాడ్మింటన్ అసోసియేషన్ క్రీడాకారులకు గాయాలవడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
-
Di Lokasi kejadian kemalangan membabitkan perseorangan badminton lelaki no 1 dunia Kento Momota. pic.twitter.com/nIvKaDHYMw
— ShahrazadSani® (@shahrazadsani) January 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Di Lokasi kejadian kemalangan membabitkan perseorangan badminton lelaki no 1 dunia Kento Momota. pic.twitter.com/nIvKaDHYMw
— ShahrazadSani® (@shahrazadsani) January 13, 2020Di Lokasi kejadian kemalangan membabitkan perseorangan badminton lelaki no 1 dunia Kento Momota. pic.twitter.com/nIvKaDHYMw
— ShahrazadSani® (@shahrazadsani) January 13, 2020
బీడబ్ల్యూఎఫ్ ఈ ఏడాది తొలి టోర్నీని మలేషియా వేదికగా నిర్వహించింది. ఇటీవల భారత స్టార్ షట్లర్లు సైనా, సింధు సహా మన దేశానికి చెందిన దాదాపు 10 మంది ప్రపంచ స్థాయి షట్లర్లు ఈ టోర్నీలో పాల్గొన్నారు.